మహేశ్ విట్ట నిర్మాతగా 'ఉత్తుత్త హీరోలు'

ABN , Publish Date - Feb 18 , 2026 | 03:25 PM

హాస్యనటుడు మహేశ్ విట్ట హీరోగా నటించి నిర్మిస్తున్న సినిమా 'ఉత్తుత్త హీరోలు'. ఈ సినిమా ఫిబ్రవరి 27న విడుదల కాబోతోంది.

Mahesh Vitta Uthuttha Herolu Movie

ప్రముఖ హాస్యనటుడు, బిగ్ బాస్ (Bigg Boss) ఫేమ్ మహేశ్‌ విట్ట (Mahesh Vitta) కూడా హీరోగా మారిపోయాడు. విశేషం ఏమంటే... అతను హీరోగా నటిస్తున్న చిత్రానికి అతనే నిర్మాత! రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు 'ఉత్తుత్త హీరోలు' (Uthutta Herolu) అనే పేరు పెట్టారు. ఈ సినిమాకు హర్ష దర్శకుడు. ఇందులో నాలుగు ప్రధాన పాత్రలు ఉంటాయని, షూటింగ్ మొత్తం కథానుగుణంగా కడపలోనే చేశామని, అదే జిల్లా నుండి 75 నటీనటులను ఎంపిక చేసి ఈ సినిమా ద్వారా పరిచయం చేస్తున్నామని మహేశ్ విట్టా తెలిపాడు. రాయలసీమ భాష, యాసతో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ఈ నెల 27న మూవీని రిలీజ్ చేస్తున్నట్టు చెప్పాడు. రాయలసీమ నుండి వస్తున్న మొదటి కల్ట్ ఫిల్మ్ ఇదని మహేశ్ విట్ట చెబుతున్నాడు.


WhatsApp Image 2026-02-18 at 3.03.49 PM.jpeg

'ఉత్తుత్త హీరోలు' సినిమాలో మహేశ్ విట్టతో పాటు ప్రవీణా సోని, తారక్ సతీష్, వాల్తేర్ వినయ్, రాహుల్ రాజ్ వనం, హర శ్రీనివాస్, భరత్ బెహరా తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు జాన్ కె జోసెఫ్ సంగీతం సమకూర్చగా, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ జీవన్ బాబు (జెబి) అందిస్తున్నారు. చోటా కె ప్రసాద్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు.

Updated Date - Feb 18 , 2026 | 03:39 PM