Mahesh Babu: ట్రెక్కింగ్.. ట్రైనింగ్.. మండుటెండల్లోనూ బిజీ బిజీ..
ABN , Publish Date - May 02 , 2026 | 02:26 PM
సూపర్‌స్టార్ మహేశ్, రాజమౌళి కాంబినేషన్‌లో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘వారణాసి’. కాస్త గ్యాప్ దొరికితే చాలు ఫ్యామిలీ టూర్ వేస్తుంటారు ప్రిన్స్.
సూపర్‌స్టార్ మహేశ్ (Mahesh Babu) రాజమౌళి (SS Rajamouli) కాంబినేషన్‌లో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘వారణాసి’ (Varanasi) కాస్త గ్యాప్ దొరికితే చాలు ఫ్యామిలీ టూర్ వేస్తుంటారు ప్రిన్స్. తాజాగా ఈ సినిమా షూటింగ్‌కు జక్కన్న కాస్త విరామం ఇచ్చారు. దాంతో మహేశ్ జర్మనీ వెళ్లారు. దాంతో అంతా ఆయన పర్సనల్ ట్రిప్ అనుకున్నారు. కానీ ఆయన టూర్‌కు వెళ్లింది సినిమా ట్రైనింగ్ కోసమే అని తాజాగా పోస్ట్ చేసిన ఫొటోలతో క్లారిటీ వచ్చింది. మహేశ్ బాబు ప్రస్తుతం జర్మనీలోని బ్లాక్ ఫారెస్ట్‌లో ఉన్నారు. అక్కడ ఆయన ఫిట్‌నెస్, వెల్‌నెస్ నిపుణులు డాక్టర్ హ్యారీ కోనిగ్ ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను మహేశ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ట్రెక్కింగ్.. ట్రైనింగ్.. తీసుకుంటూ వారణాసి కోసం సిద్థమవుతున్నట్లు పోస్టులో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఇప్పటికే రాజమౌళి సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా ఫాలోయింగ్ ఉంది. ఈసారి కూడా ఆయన గ్లోబల్ ఆడియన్స్‌ను టార్గెట్ చేసి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. రూపొందిస్తున్నారు. ప్రపంచాన్ని చుట్టే సాహసికుడుగా ఇందులో మహేశ్ కనిపిస్తారు. ఇప్పటికే విడుదల చేసిన టీజర్‌లో ఈ చిత్రం కథలో ఉన్న కోణాలను తెలిపారు రాజమౌళి. ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా కనిపిస్తారు. దుర్గా ఆర్ట్స్ పతాకంపై కె.ఎల్ నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 7న సినిమాను విడుదల చేయనున్నారు.