ఏ కథ చెప్పి మహేష్ ని ఒప్పించవయ్యా అనిల్..
ABN , Publish Date - Aug 25 , 2026 | 04:23 PM
స్టార్స్ మాస్ ఇమేజ్ ని, ఫ్యామిలీ ఆడియన్స్‌లో ఉన్న క్రేజ్‌ని సరిగ్గా వాడుకోవడంలో దర్శకుడు అనిల్ రావిపూడి తన ప్రత్యేకతను చాటుకున్న విషయం తెల్సిందే.
స్టార్స్ మాస్ ఇమేజ్ ని, ఫ్యామిలీ ఆడియన్స్‌లో ఉన్న క్రేజ్‌ని సరిగ్గా వాడుకోవడంలో దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) తన ప్రత్యేకతను చాటుకున్న విషయం తెల్సిందే. ఎంత పెద్ద హీరో అయినా సరే అనిల్ చేతిలో పడ్డాడు అంటే.. అతని వైబ్ లోకి రావాల్సిందే. ఇప్పటివరకు పరాజయమే లేని డైరెక్టర్ గా ఒక మంచి గుర్తుంపు తెచ్చుకునం అనిల్ ప్రస్తుతం జనవరి 12 విడుదల సినిమాతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఈ సినిమా తరువాత అనిల్.. మరోసారి మహేష్ బాబుతో సినిమా చేయడానికి సిద్దమయ్యాడని టాక్ నడుస్తోంది. 2020 సంక్రాంతికి వచ్చిన వీరి కాంబినేషన్ చిత్రం సరిలేరు నీకెవ్వరు రికార్డు వసూళ్లు సాధించి బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ హిట్ కాంబో మళ్లీ పునరావృతం కాబోతోందని టాలీవుడ్ వర్గాల్లో ఊహాగానాలు జోరందుకున్నాయి.
దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళితో మహేష్ బాబు చేస్తున్న భారీ పౌరాణిక అడ్వెంచర్ చిత్రం వారణాసి పూర్తి కాగానే, ఆయన అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్ చేయడానికి చర్చలు జరుపుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అనిల్ రావిపూడి ఇప్పటికే ఒక పవర్‌ఫుల్ ఫ్యామిలీ లైన్‌ను మహేష్‌కు వినిపించారని, దానికి మహేష్ కూడా సానుకూలంగా స్పందించాడని తెలుస్తోంది. అంతేకాకుండా వారణాసి రిలీజ్ కు ముందే మహేష్ డేట్స్ ఇవ్వడానికి కూడా సిద్ధం అయ్యాడంటే.. అనిల్ ఏ రేంజ్ లో కథ చెప్పి ఉంటాడో అర్ధం చేసుకోవచ్చు.
ఇక ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను సంక్రాంతి 2028 కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారట.ఇక ఈ విషయం తెలియడంతో సరిలేరు నీకెవ్వరు లాంటి మాస్ ప్లస్ ఫ్యామిలీ మ్యాజిక్‌ను మళ్లీ చూడవచ్చని మహేష్ అభిమానులు పండుగ చేసుకుంటుండగా, మరికొందరు మహేష్ నుంచి సరికొత్త జోనర్లను ఆశిస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. వారణాసి షూటింగ్ పురోగతిని బట్టి ఈ సినిమా షెడ్యూల్స్ ఖరారు కానున్నాయని సమాచారం. మరి అనిల్.. మహేష్ కోసం ఎలాంటి కథను సిద్ధం చేశాడో చూడాలి.