Varanasi: లే గ్రాండ్ లెక్స్ థియేట‌ర్‌లో.. దుమ్ములేపిన‌ 'వార‌ణాసి' టీజ‌ర్

ABN , Publish Date - Jan 06 , 2026 | 08:00 AM

రాజమౌళి, మహేష్ బాబు కాంబినేష‌న్‌లో ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందుతున్న‌ వారణాసి చిత్రం స‌రికొత్త చ‌రిత్ర సృష్టించింది.

Varanasi

దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి (S.S. Rajamouli), సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేష‌న్‌లో ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందుతు పాన్ వరల్డ్ చిత్రం వారణాసి (Varanasi). ఇప్పటికే ఈ మూవీ దేశ సరిహద్దులు దాటి అంతర్జాతీయ స్థాయిలో హంగామా చేస్తోంది. జేమ్స్ కామ‌రూన్ వంటి వారు ఈ సినిమా చిత్రీక‌ర‌ణ‌ను చూడ‌డానికి ఊవిల్లూరుతున్నాడంటే ఈ సినిమాపై ఏ రేంజ్లో హైప్స్ ఉన్నాయో అర్థ‌మ‌వుతుంది.

అయితే.. గ‌త రెండు రోజులుగా ఈ చిత్రం టీజ‌ర్‌ను ప్ర‌ఖ్యాత పారిస్‌లోని లే గ్రాండ్ లెక్స్ (Le Grand Rex) థియేట‌ర్‌లో ప్ర‌ద‌ర్శించ‌నున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో అనుకున్న‌ట్లుగానే భార‌త కాల‌మానం ప్ర‌కారం సోమ‌వా రాత్రి 9 గంట‌ల‌కు ఆ థియేట‌ర్‌లో వార‌ణాసి టీజ‌ర్‌ను ప్ర‌ద‌ర్శించారు. దీంతో ఈ ఘ‌న‌త ద‌క్కించుకున్న తొలి చిత్రం అంతేగాక‌ ఏకైక సినిమాగా వార‌ణాసి సినిమా భార‌తీయ సినీ చ‌రిత్ర‌లో కొత్త ఆధ్యాయాన్ని న‌మోదు చేసింది.

ఇందుకు సంబంధించిన విజువ‌ల్స్ ఇప్పుడు సోష‌ల్‌మీడియాలో బాగా వైర‌ల్ అవుతుంది. వీటిని చూసిన వారంతా రాజ‌మౌళిని, తెలుగు సినిమాను ఆకాశానికెత్తేస్తున్నారు. స‌ద‌రు వీడియోను ఆ థియేట‌ర్ యాజ‌మాన్యం త‌మ అఫీసియ‌ల్ ఎక్స్ అకౌంట్‌లోనూ పోస్టు చేయ‌గా గంట‌ల వ్య‌వ‌ధిలోనే 30 వేల మంది వీక్షించారు. అంతేకాదు ఆ థియేట‌ర్ వారికి అత్య‌ధిక వ్యూస్ తీసుకువ‌చ్చిన పోస్టు కూడా ఇదే కావ‌డం విశేషం. అంత‌కుముందు వీరు చేసిన పోస్టులు ఏది 10 వేలు కూడా మించ‌క పోవ‌డం గ‌మ‌నించాల్సిన విష‌యం.

Updated Date - Jan 06 , 2026 | 08:13 AM