Mahesh Babu: భాగ్యనగరంలో.. 'వారణాసి' యాక్షన్ సీక్వెన్స్
ABN , Publish Date - Jan 09 , 2026 | 08:53 AM
మహేశ్ బాబు, రాజమౌళి క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'వారణాసి' సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. ఇక్కడ వేసిన కాశీ సెట్ లో యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నారు.
దర్శక ధీరుడు రాజమౌళి (Rajamouli), ప్రిన్స్ మహేశ్ బాబు (Mahesh Babu) క్రేజీ కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న సినిమా 'వారణాసి' (Varanasi). ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ ఈవెంట్, ఆ సందర్భంగా విడుదల చేసిన గ్లింప్స్ యావత్ ప్రపంచంలోని సినిమా అభిమానుల దృష్టిని ఆకర్షించింది. ఒక్కసారిగా 'వారణాసి' మూవీకి హైప్ పెరిగింది. అయితే ఈ సినిమా షూటింగ్ ఎలాంటి హడావుడి లేకుండా సైలెంట్ గా జరిగిపోతోంది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ అయ్యానని ప్రకాశ్ రాజ్ తెలిపారు.
'వారణాసి' మూవీ కోసం హైదరాబాద్ లో కాశీని తలపించేలా ఓ భారీ సెట్ ను నిర్మాతలు కె.ఎల్. నారాయణ, ఎస్.ఎస్. కార్తికేయ నిర్మించారు. ఈ సెట్ లోనే తాజాగా షూటింగ్ జరుగుతోంది. మహేశ్ బాబుతో పాటు ప్రకాశ్ రాజ్ సైతం ఇందులో పాల్గొన్నారు. ప్రస్తుతం మహేశ్ బాబు మీద ఓ హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ తీస్తున్నారని తెలుస్తోంది. ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ ఓ కీలక పాత్రను పోషిస్తున్నాడు. వచ్చే యేడాది సమ్మర్ స్పెషల్ గా 'వారణాసి'ని మేకర్స్ రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు.