Mahesh Babu: 'రాజకుమారుడు' రిలీజ్ డేట్.. సెంటిమెంట్‌గా మంచిదే..
ABN , Publish Date - Jul 26 , 2026 | 02:48 PM
శ్రీనివాస మంగాపురం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మహేశ్‌బాబును గెస్ట్‌గా ఆహ్వానించాలని ప్లాన్ చేశారు. ‘ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు బాబాయ్ అతిథిగా వస్తారని’ హీరో జయకృష్ణ కూడా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అయితే తాజా సమాచారం ప్రకారం మహేశ్ ఈవెంట్‌కు రావడం లేదని తెలిసింది.
సూపర్’ కృష్ణ మనవడు జయకృష్ణ ‘శ్రీనివాస మంగాపురం’ చిత్రంతో హీరోగా పరిచయమవుతున్న సంగతి తెలిసిందే! రషా తడానీ కథానాయిక. అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నారు. పి.కిరణ్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందిన హీరోలను వెండితెరకు పరిచయం చేసిన నిర్మాత అశ్వినీదత్ ఈ సినిమాతో జయకృష్ణని హీరోగా తెరపైకి తీసుకొస్తుండటంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ నెల 30 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో భారీగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారు. దీనికి మహేశ్‌బాబును మహేశ్‌బాబును గెస్ట్‌గా ఆహ్వానించాలని ప్లాన్ చేశారు. ‘ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు బాబాయ్ అతిథిగా వస్తారని’ హీరో జయకృష్ణ కూడా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అయితే తాజా సమాచారం ప్రకారం మహేశ్ ఈవెంట్‌కు రావడం లేదని తెలిసింది. అయితే మహేశ్ ఈ వేడుకకు రాకపోవడానికి కారణం రాజమౌళి అనుమతి దక్కలేదని చెబుతున్నారు. వారణాసి సినిమా కోసం హైదరాబాద్ వేసిన సెట్‌లో మహేశ్‌పై కీలక సన్నివేశాల చిత్రీకరణ చేస్తున్నారు. అందుకే ఈ మహేశ్ ఈ వేడుకకు రావడం లేదని కూడా తెలుస్తోంది.
అందుకేనా మహేశ్ వీడియో బైట్..
ఈ మేరకు జయకృష్ణ, శ్రీనివాస మంగాపురం’ టీమ్‌కు శుభాకాంక్షలు చెబుతూ ఓ వీడియో విడుదల చేశారు. ‘మా రమేష్ అన్న వాళ్ల అబ్బాయి జయకృష్ణ హీరోగా ఎంట్రీ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. ఇది మా కుటుంబానికి చాలా సంతోషకరమైన విషయం. ఇప్పటి వరకు చూసిన టీజర్, సాంగ్స్, చాలా బావున్నాయి. ఆన్ స్ర్కీన్ జయకృష,్ణ రషా తడానీ చాలా ప్రామిసింగ్‌గా కనిపిస్తున్నారు. ఈ క్రెడిట్ అంతా అజయ్ భూపతికే దక్కుతుంది. ఈ నెల 30 సినిమా విడుదల కానుంది. నా మొదటి సినిమా ‘రాజ కుమారుడు’ విడుదలైన రోజు ఇది. ఇదంతా అశ్వినీదత్‌గారి ప్లానింగ్. ఇలాంటి విషయాల్లో ఆయన చాలా పకడ్భందీగా ఉంటారు. నేను, రామ్‌చరణ్, అల్లు అర్జున్ వంటి వారంతా ఆయన బ్యానర్ ద్వారానే హీరోలుగా పరిచయమయ్యాం. ఇదే బ్యానర్‌లో లాంచ్ అవుతున్న జయకృష్ణకు కూడా నాన్నగారి అభిమానులు, నా అభిమానుల సపోర్ట్‌తో మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నా’ అని మహేశ్‌బాబు వీడియోలో పేర్కొన్నారు.