మహేంద్రగిరి వారాహి.. థియేటర్స్ లో అమ్మవారి విగ్రహాలు

ABN , Publish Date - Jul 17 , 2026 | 03:26 PM

హీరో సుమంత్ (Sumanth) నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ స్పిరిచువల్ మిస్టరీ థ్రిల్లర్ మహేంద్రగిరి వారాహి (Mahendragiri Varahi). సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం మహేంద్రగిరి నేపథ్యంలో వారాహి అమ్మవారి దివ్య శక్తి చుట్టూ తిరిగే ఒక అద్భుతమైన కథాంశంతో రూపొందుతోంది.

Mahendragiri Varahi

హీరో సుమంత్ (Sumanth) నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ స్పిరిచువల్ మిస్టరీ థ్రిల్లర్ మహేంద్రగిరి వారాహి (Mahendragiri Varahi). సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం మహేంద్రగిరి నేపథ్యంలో వారాహి అమ్మవారి దివ్య శక్తి చుట్టూ తిరిగే ఒక అద్భుతమైన కథాంశంతో రూపొందుతోంది. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి గోస్వామి, మాళవిక నాయర్, బ్రహ్మానందం వంటి భారీ తారాగణం ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. రాజశ్యామల ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు బ్రిడ్జ్ ఫిల్మ్స్ బ్యానర్లపై కాలిపు మధు, లక్ష్మణ్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకుల్లో గట్టి అంచనాలను క్రియేట్ చేసింది.


అయితే, ఈ సినిమా ప్రమోషన్స్ కోసం చిత్ర యూనిట్ ఎవరూ ఊహించని ఒక సరికొత్త, అత్యంత భక్తిపూర్వకమైన ప్లాన్‌తో ముందుకు వచ్చింది. సినిమా విడుదల కాబోయే థియేటర్లలోనే వారాహి దేవి విగ్రహాలను ప్రతిష్టించాలని మేకర్స్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. థియేటర్‌లోకి అడుగుపెట్టిన క్షణం నుంచే ప్రేక్షకులు ఆ ఆధ్యాత్మిక అనుభూతిని పొందేలా ఈ వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన థియేటర్లలో ఈ వారాహి దేవి విగ్రహాలను ఏర్పాటు చేయబోతున్నారు. ఈ వినూత్న ఐడియా సినిమాపై అంచనాలను, భక్తిభావాలను మరింతగా పెంచేలా ఉంది. అయితే ఇలాంటి ట్రెండ్ ఏమి టాలీవుడ్ లో కొత్తేమీ కాదు.. అప్పట్లో అమ్మోరు సినిమా రిలీజ్ కి థియేటర్ లోనే అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించి పూజలు చేశారట. ఆ తరువాత శ్రీరామ రాజ్యం సినిమాకు కూడా థియేటర్ లో సీతారాముల విగ్రహాలను పెట్టారు. ఇక ఇప్పుడు మహేంద్రగిరి వారాహి టీమ్ అదే పని చేస్తోంది.


ఇక ఈ విగ్రహాల ప్రతిష్ఠాపన ప్రచారంలో భాగంగా మొదటి విడత కార్యక్రమాన్ని శనివారం హైదరాబాద్, మూసాపేటలోని శ్రీరాములు థియేటర్ లో ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో హీరో సుమంత్ తో పాటు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొని స్వయంగా వారాహి దేవి విగ్రహాన్ని లాంచ్ చేయబోతున్నారు. సినిమా థీమ్‌కు తగ్గట్లుగా ఈ స్థాయిలో భక్తిని ప్రచారంలోకి తీసుకురావడం మంచి విషయమని పలువురు చెప్పుకొస్తున్నారు.మరి ఈ సినిమాతో సుమంత్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Updated Date - Jul 17 , 2026 | 03:29 PM