‘మహావతార్ పరశురామ్’ వచ్చేది ఎప్పుడంటే..
ABN , Publish Date - Apr 19 , 2026 | 02:30 PM
దర్శకుడు అశ్విన్ కుమార్ (Ashwin kumar) తెరకెక్కించిన యానిమేషన్ చిత్రం ‘మహావతార్ నరసింహ’ ఎంతగా ప్రేక్షకాదరణ పొందిందో తెలిసిందే!
దర్శకుడు అశ్విన్ కుమార్ (Ashwin kumar) తెరకెక్కించిన యానిమేషన్ చిత్రం ‘మహావతార్ నరసింహ’ ఎంతగా ప్రేక్షకాదరణ పొందిందో తెలిసిందే! ‘మహావతార్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా రెండేళ్లకు ఓ సినిమా చొప్పున ఏడు సినిమాలు వస్తాయని ఇప్పటికే దర్శకుడు ప్రకటించారు. ఆ సిరీస్‌లో భాగంగా ఇప్పుడు రెండో చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. పరశురామ్ జయంతి సందర్భంగా నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ టైటిల్‌ను విడుదల చేసింది. రెండో పార్ట్ చిత్రానికి ‘మహావతార్ పరశురామ్’ (Mahavatar Parasuram) టైటిల్ ఖరారు చేశారు. పరుశురాముడు తన ఆయుధంతో వెళ్తున్న ఫోటోలను షేర్ చేసి ‘పాలకుడు కాదు, అధర్మానికి వ్యతిరేకంగా పోరాడుతూ, యుగయుగాలుగా సమతుల్యతను పునరుద్థరించే ఒక శక్తి’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది డిసెంబర్‌లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ‘