నేడు 'ఇళయరాజా కచేరి'.. ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు

ABN , Publish Date - Mar 28 , 2026 | 07:30 AM

గచ్చిబౌలి స్టేడియంలో ఈ రోజ (శనివారం) సాయంత్రం ప్రముఖ సంగీత దర్శకులు ఇళయరాజా (Ilaiyaraaja) కచేరి నిర్వహించనున్నారు.

Ilaiyaraaja

గచ్చిబౌలి స్టేడియంలో ఈ రోజ (శనివారం) సాయంత్రం ప్రముఖ సంగీత దర్శకులు ఇళయరాజా (Ilaiyaraaja) కచేరి నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఐటీ కారిడార్‌ పరిధిలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ మళ్లింపులు ఉంటాయని సైబరాబాద్‌ పోలీసులు (Cyberabad Traffic Police) తెలిపారు.

శనివారం సాయంత్రం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు గచ్చిబౌలి ట్రిపుల్‌ ఐటీ జంక్షన్‌, గచ్చిబౌలి స్టేడియం, హెచ్‌సీయూ గేట్‌ నంబరు.2, లింగంపల్లి మార్గంలో వాహనాల రాకపోకలకు ఆంక్షలు విధించినట్లు తెలిపారు. గచ్చిబౌలి జంక్షన్‌ నుంచి వచ్చే వాహనాలను ట్రిపుల్‌ ఐటీ జంక్షన్‌ వద్ద ఐఎస్‌బీ రోడ్డు వైపు మళ్లించి విప్రో సర్కిల్‌, గౌలిదొడ్డి, లింగంపల్లి వైపు వెళ్లేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.

Traffic Restrictions

ఫైనాన్సియల్ డిస్ట్రిక్‌ వైపు నుంచి ట్రిపుల్‌ ఐటీ జంక్షన్‌ వైపు వచ్చే వాహనాలను విప్రో జంక్షన్‌ వద్ద నానక్‌రాంగూడ రోటరీ-2 వైపు మళ్లించి, గచ్చిబౌలి ఓఆర్‌ఆర్‌ మీదుగా వెళ్లేలా.. అలాగే లింగంపల్లి నుంచి గచ్చిబౌలి వైపు వచ్చే వాహనాలను మజీద్‌బండ, శ్రీరాంనగర్‌, బొటానికల్‌ గార్డెన్‌ మీదుగా మెహిదీపట్నం వెళ్లేలా ట్రాఫిక్‌ మళ్లింపు చర్యలుంటాయని తెలిపారు.

Updated Date - Mar 28 , 2026 | 07:30 AM