లిరిసిస్ట్ చంద్రబోస్ ఇంట తీవ్ర విషాదం

ABN , Publish Date - May 03 , 2026 | 09:42 PM

ప్రముఖ గేయ రచయిత, ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ (Chandrabose) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. చంద్రబోస్ సోదరుడు రాజేంద్ర మరణించారు.

Chandrabose

ప్రముఖ గేయ రచయిత, ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ (Chandrabose) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. చంద్రబోస్ సోదరుడు రాజేంద్ర మరణించారు. దీంతో చంద్రబోస్ కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. రాజేంద్ర బెంగుళూరులో కుటుంబంతో కలిసి నివాసముంటారు. వ్యాపారం పనిమీద శనివారం బెంగుళూరు నుంచి అన్నమయ్య జిల్లాలోని కలికిరి నగరం వచ్చిన రాజేంద్ర అక్కడే ఉంటున్న తన ఫ్రెండ్ శ్రీనివాస్ ఇంట్లో బస చేశారు. ఆదివారం ఉదయం అస్వస్థతగా అనిపించి హాస్పిటల్ కి వెళ్ళారు. అనంతరం ఒక హోటల్ లో టిఫిన్ చేయగా.. తిన్న వెంటనే హఠాత్తుగా గుండెపోటు రావడంతో అక్కడిక్కకడే మరణించారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటినా సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి, ఫ్యామిలీకి సమాచారం అందించారు. చంద్రబోస్ సోదరుడు మరణ వార్త విన్న పలువురు ప్రముఖులు రాజేంద్ర మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు.

Updated Date - May 03 , 2026 | 09:58 PM