భోగి.. ఏం డేట్ పట్టావన్నా.. అదిరిపోయిందంతే
ABN , Publish Date - Nov 22 , 2026 | 07:40 PM
ఇండస్ట్రీలో ప్రస్తుతం యంగ్ హీరో శర్వానంద్ (Sharwanand) కి మించిన అదృష్టవంతుడు లేడు అని చెప్పుకొస్తున్నారు. ఎదురుచూస్తే చూశాడు కానీ.. మంచి డేట్ పట్టేశాడు అంటూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
ఇండస్ట్రీలో ప్రస్తుతం యంగ్ హీరో శర్వానంద్ (Sharwanand) కి మించిన అదృష్టవంతుడు లేడు అని చెప్పుకొస్తున్నారు. ఎదురుచూస్తే చూశాడు కానీ.. మంచి డేట్ పట్టేశాడు అంటూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. అసలు ఏమైంది.. ఎందుకు శర్వాని పొగుడుతున్నారు అంటే.. ప్రస్తుతం శర్వా నటించిన చిత్రాల్లో భోగి (Bhogi) ఒకటి. రచ్చ, గౌతమ్ నందా, సీటిమార్ వంటి పక్కా కమర్షియల్ హిట్స్ ఇచ్చిన సంపత్ నంది దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో పాటు అంచనాలను అమాంతం పెంచేశాయి. ముఖ్యంగా మునుపెన్నడూ చూడని వూర మాస్ గెటప్ లో శర్వా కనిపించాడు.
అన్ని బావుండి ఉంటే గత శుక్రవారం అనగా నవంబర్ 12నే భోగీ రిలీజ్ కావాల్సి ఉండి. కాకపోతే సెన్సార్ కారణాల వల్ల నవంబర్ 27కు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ డేట్ ఎంత లక్కీ అవుతుందని శర్వా కూడా అనుకోని ఉండడు. మామూలుగా అయితే భోగికి ఒకటి కాదు రెండు పెద్ద సినిమాలు, ఒక అనువాద చిత్రం.. ఇంకో చిన్న సినిమాతో పోటీకి దిగి ఉండాలి. కానీ, ఆ రెండు పెద్ద సినిమాలు వాయిదా పడడంతో శర్వాకి పెద్ద ప్లస్‌గా మారింది. ఆ రెండు సినిమాలు ఏంటంటే.. ఒకటి మైసా.. ఇంకొకటి హైందవ. రష్మిక మందన్నా ప్రధాన పాత్రలో నటించిన ఈ యాక్షన్ డ్రామా.. నవంబర్ 25 న రిలీజ్ కావాల్సిఉంది. కానీ, ఎన్నికల కారణంగా ఈ సినిమా వెనక్కి తగ్గింది.
మైసా కాకుండా మంచి బజ్ ఉన్న బెల్లంకొండ సాయిశ్రీనివాస్ మిస్టిక్ యాక్షన్ థ్రిల్లర్ హైందవ, హడావిడిగా కాకుండా పక్కా క్వాలిటీతో ఫిబ్రవరిలో రావాలనే ఉద్దేశంతో వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఈ రెండు పోటీ నుంచి తప్పుకోవడంతో భోగికే ఎక్కువ థియేటర్లు వచ్చే అవకాశం ఉంది. దీనివలన సినిమాకి మంచి కలక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. ఓం వలన.. ఆకాశంలో ఒక తార, ఈఎన్ ఈ రీపీట్ కి థియేటర్లు తగ్గిన విషయం తెల్సిందే. అయితే ఈ రెండు తెలుగు సినిమాలు మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో ఇప్పుడు థియేటర్లను పెంచుతున్నారు. భోగికి అలాంటి పరిస్థితి రాదనే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. అయితే కథ బావుంటేనే ఇదంతా.. లేదు అంటే చిన్న సినిమాగా వస్తోన్న హై కానీ, అనువాద చిత్రంగా వస్తున్న నాన్నకుట్టి కానీ భోగి థియేటర్స్ ని ఎగరేసుకుపోతాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మరి భోగితో శర్వా మ్యాజిక్ చేస్తాడా.. వచ్చిన లక్కీ ఛాన్స్ ని ఉపయోగించుకుంటాడా అనేది చూడాలి.