SKN: బాలచందర్‌, భారతీరాజా కథల్లా.. సాయి రాజేశ్ కథలో బలం ఉంటుంది

ABN , Publish Date - Jul 26 , 2026 | 08:14 AM

మా ప్రేమ కథపై ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమకు కృతజ్ఞతలు. ముఖ్యంగా మహిళా ప్రేక్షకులు ఈ సినిమాను బాగా ఆదరిస్తున్నారు’ అని అన్నారు కిరణ్‌ అబ్బవరం

Chennai Love Story

‘ప్రతి ప్రేమ కథ ఒకేలా ఉంటే చరిత్రకు కూడా నచ్చదు. మాది కొత్త ప్రేమ కథ. మా ప్రేమ కథపై ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమకు కృతజ్ఞతలు. ముఖ్యంగా మహిళా ప్రేక్షకులు ఈ సినిమాను బాగా ఆదరిస్తున్నారు’ అని అన్నారు కిరణ్‌ అబ్బవరం (Kiran Abbavaram).

ఆయన హీరోగా, శ్రీ గౌరి ప్రియ (Sri Gouri Priya) హీరోయిన్‌గా రవి నంబూరి (Ravi Namburi) తెరకెక్కించిన ‘చెన్నై లవ్‌ స్టోరీ’ (Chennai Love Story) చిత్రం ఇటీవలే విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్‌ శనివారం విజయోత్సవ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కిరణ్‌ అబ్బవరం మాట్లాడుతూ ‘ప్రీమియర్స్‌ నుంచే థియేటర్ల వద్ద హౌస్‌ఫుల్‌ బోర్డులు కనిపించడం చాలా సంతోషంగా ఉంది. ఫ్యామిలీ ఆడియెన్స్‌ మా మూవీకి బాగా కనెక్ట్‌ అవుతున్నారు’ అని చెప్పారు.

శ్రీ గౌరి ప్రియ మాట్లాడుతూ ‘ఒక జంట మీదే కథ సాగాలంటే సన్నివేశాలు ఎంతో ఆసక్తికరంగా ఉండాలి. ఆ సన్నివేశాలను ఆకట్టుకునేలా అభినయించగలగాలి. కిరణ్‌ లాంటి మంచి కోస్టార్‌ వల్లే అద్భుతమైన నటనను అందించగలిగాం’ అని అన్నారు. ‘బాలచందర్‌, భారతీరాజా కథల్లా సాయి రాజేశ్ (Sai Rajesh) కథలో బలం ఉంటుంది. పాత్రలు బలంగా ఉంటాయి. అందుకే ఆయనకు రెండు జాతీయ అవార్డులు వచ్చాయి’ అని నిర్మాత ఎస్‌కేఎన్ (SKN) అన్నారు. కార్యక్రమంలో నిర్మాత ధీరజ్‌ మొగిలినేని, దర్శకుడు రవి నంబూరి, నటుడు త్రిగుణ్‌ తదితరులు మాట్లాడారు.

Updated Date - Jul 26 , 2026 | 08:14 AM