సినిమా విడుదలైన గంటల్లోనే పైరసీ.. రిలీజ్ రోజే నాలుగు సినిమాలు లీక్!
ABN , Publish Date - Nov 22 , 2026 | 07:51 AM
తెలుగు సినీ పరిశ్రమలో మరోసారి పైరసీ కలకలం రేగింది.
తెలుగు సినీ పరిశ్రమను (Tollywood) పైరసీ మాపియా (Movie Piracy) మళ్లీ బలమైన దెబ్బ కొట్టింది. ఆకాశంలో ఒక తారస (Aakasamlo Oka Tara) విడుదలైన తొలి రోజే ఆ సినిమాతో పాటు మరో మూడు తెలుగు సినిమాలు ఒక పైరసీ వెబ్‌సైట్‌లో ప్రత్యక్షమయ్యాయి. తెలుగు పిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
రణభాలి (Ranabaali), కల్ట్ (Cult), 'ఆదర్శకుటుంబం హౌస్ నెంబర్ 47 (Aadarsha Kutumbam House No: 47), 'ఆకాశంలో ఒక తార సినిమాలు పైరసీ జరిగినట్లు శుక్రవారం తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (Film Chamber of Commerce ) లోని యాంటీ పైరసీ సెల్ (Anti Piracy Cell) అధికారులు గుర్తించారు.
యాంటీ పైరసీ సెల్ నిపుణులు పైరసీని మానిటరింగ్ చేస్తున్న క్రమంలో ఈ నాలుగు సినిమాల పైరేటెడ్ కాపీలను 'ఇండియా4మూవీస్.క్లిక్ వెబ్‌సైట్‌లో ప్రత్యక్షం కావడం గమనించి ప్రాథమిక దర్యాప్తు చేపట్టారు.
ఆకాశంలో ఒక తార సినిమా పైరేటెడ్ కాపీ సోర్స్ కనుక్కోవాలని, సినిమా విడుదలైన రోజే అప్లోడ్ చేయడంపై వెనుక ఉన్న వారి పాత్ర గురించి విచారణ చేపట్టాలని యాంటి పైరసీ ప్రాజెక్సెల్ హెడ్ మణీంద్రబాబు ఫిర్యాదులో కోరారు.