Nagavamsi: 'లెనిన్' లెక్కలు నిజమేనా.. పోస్టర్స్ వరకేనా?
ABN , Publish Date - Jul 14 , 2026 | 01:20 PM
అక్కినేని అఖిల్ హీరోగా నటించిన ‘లెనిన్’ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో దూసుకెళ్తోంది. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు తొలి రోజు నుంచే ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది.
అక్కినేని అఖిల్ (Akhil Akkineni) హీరోగా నటించిన ‘లెనిన్’ (Lenin Collections) బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో దూసుకెళ్తోంది. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు తొలి రోజు నుంచే ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ముఖ్యంగా అఖిల్ కెరీర్‌లోనే బలమైన ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో అక్కినేని అభిమానులు కూడా ఈ విజయాన్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సినిమా విడుదలైన మూడు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.61.1 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు,ప్రేక్షకుల ఆదరణకు కృతజ్ఞతలు తెలుపుతూ చిత్రబృందం సోషల్ మీడియాలో ప్రత్యేక పోస్టర్‌ను పంచుకుంది. ఈ పోస్టర్ వైరల్ కాగా కొత్త చర్చకు దారి తీసింది. దీనికి కారణం వసూళ్ల కంటే అందులో పేర్కొన్న రూ.61.1 కోట్ల నంబర్స్. సితార సంస్థ సంక్రాంతికి విడుదల చేసిన ‘అనగనగా ఒక రాజు’ మూడు రోజుల కలెక్షన్ల పోస్టర్‌లో కూడా రూ.61.1 కోట్ల అని పేర్కొన్నారు. ఇప్పుడు ఈ విషయంపై ట్రోలింగ్ మొదలుపెట్టారు. ఒకే బ్యానర్‌కు చెందిన వేర్వేరు సినిమాలకు ఒకే విధమైన కలెక్షన్ ఫిగర్ ఎలా వచ్చిందంటూ సోషల్ మీడియాలో చర్చ మొదలు పెట్టారు.
దీనిపై కొందరు పాజిటివ్ గా స్పందిస్తుంటే మరికొందరు వెటకారంగా పోస్టులు చేస్తూ ట్రోల్స్ చేస్తున్నారు. ఇంకొందరు ఐతే నిర్మాణ సంస్థ కలెక్షన్ల గురించి ప్రకటించిన సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ట్రేడ్ అంచనాలకు, పోస్టర్‌లో పేర్కొన్న వసూళ్లకు తేడా ఉందని వ్యాఖ్యానిస్తున్నారు. దీనిపై చిత్ర నిర్మాణ సంస్థ నుంచి ఎలాంటి స్పందన రాలేదు.అలాగే 'లెనిన్’ సినిమాలో కాపీ సన్నివేశాలు చాల ఉన్నాయని సోషల్ మీడియాలో పోలికలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కలెక్షన్ల పోస్టర్ కూడా చర్చనీయాంశంగా మారడంతో ఈ సినిమా మరోసారి నెట్టింట హాట్ టాపిక్‌గా నిలిచింది.