లేచింది మహిళా లోకం.. భర్తను చంపమంటున్న మంచు లక్ష్మీ..

ABN , Publish Date - Mar 09 , 2026 | 06:27 PM

ఈ మధ్యకాలంలో భర్తలను చంపడం ఆడవారికి ఫ్యాషన్ గా మారిపోయింది. చిన్న చిన్న విషయాలకే సహనం కోల్పోయి భర్తలను చంపుతున్నారు. తాజాగా ఈ కాన్సెప్ట్ తోనే వినోదాత్మకంగా తెరకెక్కిన చిత్రం లేచింది మహిళా లోకం (Lechindi Mahila Lokam).

Lechindi Mahila Lokam

ఈ మధ్యకాలంలో భర్తలను చంపడం ఆడవారికి ఫ్యాషన్ గా మారిపోయింది. చిన్న చిన్న విషయాలకే సహనం కోల్పోయి భర్తలను చంపుతున్నారు. తాజాగా ఈ కాన్సెప్ట్ తోనే వినోదాత్మకంగా తెరకెక్కిన చిత్రం లేచింది మహిళా లోకం (Lechindi Mahila Lokam). మంచు లక్ష్మి (Manchu Lakshmi), శ్రీరామ చంద్ర (Sreeramachandra), అనన్య నాగళ్ల (Ananya Nagalla), శ్రద్ధా దాస్ ప్రధాన పాత్రల్లో అర్జున్ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని హైమ రాజశేఖర్, శ్వేత మహి, నిరోషా నవీన్ నిర్మించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

తాజాగా లేచింది మహిళా లోకం ట్రైలర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం నవ్వులు పూయిస్తోంది. ప్రస్తుత సమాజంలో మహిళలు ఎలా ఉన్నారు అనేది వినోదాత్మకంగా చూపించారు. శ్రీరామ్ చంద్ర, అనన్య భార్యాభర్తలు. పెళ్ళైన మొదటిరోజునే సాగర్.. అనన్యను వదిలి జాబ్ ఉందని ఆఫీస్ కి వెళ్తాడు. తన మీద ప్రేమ లేకపోవడం వలనే వెళ్లిపోయాడు అని అనన్య బాధపడుతుంది. అలా ఆ భార్యభర్తల మధ్య జరిగే చిన్న చిన్న గొడవలను పక్కింటి మహిళ, పని మనిషి, ఫ్రెండ్.. ఇలా అందరూ మహిళలు కలిసి విడాకుల వరకు తీసుకొస్తారు. లాయర్ అయిన మంచు లక్ష్మీ ఈ గొడవలను చూసి.. విడాకులు పరిష్కారం కాదని, భర్తను చంపడమే పరిష్కారమని చెప్పి.. శ్రీరామ్ ని చంపడానికి ప్లాన్ చేస్తూ ఉంటుంది. అసలు ఆ భార్యాభర్తల మధ్య జరిగింది ఏంటి.. ? ఈ మహిళా లోకం మొత్తం ఒక మగాడిపై ఎలా కక్ష కట్టింది.. ? చివరికి శ్రీరామ్ ని చంపారా .. ? లేదా.. ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

లేచింది మహిళా లోకం అనే టైటిల్ చాలా స్ట్రాంగ్ గా ఉండడంతో.. ఏదైనా పోరాటం మీద కథ ఉంటుంది అనుకున్నారు. కానీ, ట్రైలర్ ని బట్టి కొంతమంది మహిళలు ఈ సమాజంలో మగాళ్ళపై, రిలేషన్స్ పై ఎలా ఆలోచిస్తున్నారు అనేది వినోదాత్మకంగా చూపించబోతున్నారని ట్రైలర్ చూస్తుంటే అర్ధమవుతోంది. ఇక ఈ సినిమాకు హైలైట్ అంటే మంచు లక్ష్మీ అని చెప్పుకోవచ్చు. మంచు ఫ్యామిలీ మీద వచ్చిన అన్ని ట్రోల్స్ ను లక్ష్మీ ఈ సినిమాలో ఎంతో పాజిటివ్ గా వాడేశారు. డైలాగ్స్ కూడా చాలా అంటే చాలా బావున్నాయి. మొత్తానికి ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో ఒక ఇంపాక్ట్ ని క్రియేట్ చేస్తోంది అని చెప్పొచ్చు. మార్చి 26 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Updated Date - Mar 09 , 2026 | 07:58 PM