సతీ లీలావతి: సినిమా వాయిదా.. కారణం ఏంటంటే

ABN , Publish Date - Mar 02 , 2026 | 08:20 PM

లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో నటిస్తున్న 'సతీ లీలావతి' వాయిదా పడింది.

లావణ్య త్రిపాఠి(Lavanya Tripati) ప్రధాన పాత్రలో నటిస్తున్న 'సతీ లీలావతి' (Sathi Leelavathi) వాయిదా పడింది. ఈ నెల 6న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని భావించారు మేకర్స్. అయితే పలు కారణాల వల్ల సినిమా విడుదల వెనక్కి వెళ్ళింది. ఈ విషయాన్నీ మేకర్స్ ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు. కొత్త విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా, ఎలాంటి రాజీ లేకుండా చిత్రాన్ని మలుస్తున్నామని మేకర్స్ పేర్కొన్నారు.  

Sathi.jpeg

కామెడీ ఎంటర్టైనర్ గా లావణ్య త్రిపాఠి, దేవ్ మోహన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రమిది. తాతినేని సత్య దర్శకుడు. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ సమర్పణలో దుర్గాదేవి బ్యానర్ పై నాగమోహన్ నిర్మించారు. నరేష్, వీటీవీ గణేష్, సప్తగిరి, మొట్టా రాజేంద్రన్, జాఫర్ సాదిక్, జోషి తదితరులు కీలకపాత్రలు పోషించారు.  

Updated Date - Mar 02 , 2026 | 08:33 PM