డైరెక్టర్ కేకే చివరి చిత్రం.. కేజేక్యూ ట్రైలర్ అదిరిపోయింది

ABN , Publish Date - Jul 27 , 2026 | 09:18 PM

దసరా ఫేమ్ దీక్షిత్ శెట్టి ( Dheekshith Shetty), యుక్తి తరేజా, శశి ఓదెల ప్రధాన పాత్రల్లో నటించిన రస్టిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ కేజేక్యూ (KJQ) (కింగ్ జాకీ క్వీన్).

దసరా ఫేమ్ దీక్షిత్ శెట్టి ( Dheekshith Shetty), యుక్తి తరేజా, శశి ఓదెల ప్రధాన పాత్రల్లో నటించిన రస్టిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ కేజేక్యూ (KJQ) (కింగ్ జాకీ క్వీన్). ఈ చిత్రానికి ప్రతిభావంతుడైన దర్శకుడు కేకే (KK) దర్శకత్వం వహించాడు. అయితే ఎంతో భవిష్యత్తు ఉన్న దర్శకుడు కేకే.. గతేడాది అకస్మాత్తుగా మరణించడం సినీ వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన దర్శకత్వం వహించిన చివరి డ్రీమ్ ప్రాజెక్ట్ కావడంతో ఈ సినిమాపై ప్రత్యేకమైన ఆసక్తి మరియు భావోద్వేగం నెలకొన్నాయి.


తాజాగా ప్రఖ్యాత నిర్మాణ సంస్థ ఎస్‌ఎల్‌వి సినిమాస్ ఈ చిత్ర పవర్‌ఫుల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తుంది. ఇద్దరు స్నేహితులు.. బద్ద శత్రువులుగా ఎలా మారారు.. ? ఒకరినొకరు చంపుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది.. ? వారిద్దరి మధ్యలో హీరోయిన్ పాత్ర ఏంటి.. ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. 'న్యాయము అన్యాయము మనకు లేవు.. మనం వేటాడాలి లేకపోతే వేటాడబడతాం, బయట విలనే హీరో అనే బలమైన డైలాగులతో కేకే ఈ సినిమాను ఎంత రా అండ్ రస్టిక్‌గా తీర్చిదిద్దాదో అర్థమవుతోంది. దీక్షిత్ శెట్టి మాస్ అవతార్, శశి ఒదెల, యుక్తి తరేజాల పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్ ట్రైలర్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.


కేకే రూపొందిన ఈ యాక్షన్ డ్రామాను ఆగస్టు 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఎస్‌ఎల్‌వి సినిమాస్ అత్యున్నత నిర్మాణ విలువలతో అందించిన ఈ చిత్రం, దర్శకుడు కేకేకి ఘన నివాళిగా నిలుస్తుందని చిత్రబృందం భావిస్తోంది. మరి ఈ సినిమాతో దీక్షిత్ శెట్టి ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Updated Date - Jul 27 , 2026 | 09:23 PM