చిన్నదైనా.. అద్భుతమైన సినిమా చేశాం
ABN , Publish Date - Mar 10 , 2026 | 07:06 AM
‘చిన్నదైనా మేము అద్భుతమైన సినిమానే చేశాం. సినిమాను సినిమాగానే చూడండి. సీరియస్ సబ్జెక్టును కామెడీగా చెప్తేనే వింటారు' అని అన్నారు నటి మంచు లక్ష్మి.
‘చిన్నదైనా మేము అద్భుతమైన సినిమానే చేశాం. సినిమాను సినిమాగానే చూడండి. సీరియస్ సబ్జెక్టును కామెడీగా చెప్తేనే వింటారు. ‘లేచింది మహిళాలోకం’ (Lechindi Mahila Lokam) మర్డర్ చేయమని చెప్పే సినిమా కాదు. అందర్నీ నవ్వించే చిత్రం’ అని అన్నారు నటి మంచు లక్ష్మి (Lakshmi Manchu).
శ్రీరామ్ చంద్ర (Sreerama Chandra), అనన్య నాగళ్ల (Ananya naagalla), హరితేజ (Hari Teja), హేమ, సుప్రిత నాయుడు (Suprita), శ్రద్ధాదాస్ (Shradda das) ప్రధాన పాత్రధారులుగా దర్శకులు అర్జున్, కార్తిక్ (Arjun-Carthyk) తెరకెక్కించిన చిత్రమిది. ఇందులో మంచు లక్ష్మి కీలక పాత్రను పోషించారు.
బృహస్పతి ఎంటర్‌టైన్‌మెంట్స్ (Brihaspathi entertainments), అప్పారెంట్లీ సినిమా (Apparently Cinema), స్టోరీ ఫ్యాక్టరీ బ్యానర్లపై హైమా రాజశేఖర్, శ్వేత మహి, నిరోష నవీన్ ఈ సినిమా నిర్మించారు. ఈనెల 26న సినిమా విడుదలవుతున్న సందర్భంగా సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో ట్రైలర్‌ని రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ‘మొదటి ప్రయత్నంలోనే ఇంత మంచి సినిమా తీశాం. అందరూ మా చిత్రాన్ని థియేటర్లలో చూసి ఆశీర్వదిస్తే ఇలాంటి మంచి సినిమాలు మరెన్నో మీ ముందుకు తీసుకొస్తాం’ అని అన్నారు. ఇప్పటివరకు ఏడుపు రోల్స్ చేశా.. ఫస్ట్ టైమ్ కామెడీ జోనర్ చేశానని నటి అనన్య నాగళ్ల అన్నారు.