బజ్జీల పాప.. మరీ ఇంత బయటపెడితే ఎలా
ABN , Publish Date - Aug 26 , 2026 | 09:18 PM
గతంలో హైదరాబాద్ పబ్ వివాదంలో బజ్జీలు తినడానికి మాత్రమే వెళ్లాను అంటూ చెప్పిన ఒకే ఒక్క డైలాగ్‌తో రాత్రికి రాత్రి సోషల్ మీడియాలో వైరల్ అయి, విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది కుషిత కళ్లపు.
గతంలో హైదరాబాద్ పబ్ వివాదంలో బజ్జీలు తినడానికి మాత్రమే వెళ్లాను అంటూ చెప్పిన ఒకే ఒక్క డైలాగ్‌తో రాత్రికి రాత్రి సోషల్ మీడియాలో వైరల్ అయి, విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది కుషిత కళ్లపు (Kushitha Kallapu). ఆ పాపులారిటీతో ఈ బ్యూటీకి తెలుగు చిత్రపరిశ్రమలో వరుస ఆఫర్లు వరించాయి. నీతోనే నేను, రంగా రంగా వైభవంగా, చాంగురే బంగారు రాజా, బాబు (నెం.1 బుల్ షిట్ గాయ్), రామబాణం వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది.
నటనతో పాటు నిత్యం సోషల్ మీడియాలో అత్యంత యాక్టివ్‌గా ఉంటూ, గ్లామరస్ ఫోటోషూట్‌లు, డ్యాన్స్ రీల్స్‌తో తన ఫాలోవర్లను ఆకట్టుకుంటూ ఉంటుంది.తాజాగా కుషిత మెగాస్టార్ చిరంజీవి నటించిన పాపులర్ మూవీ రిక్షావోడులోని రూప్ తేరా మస్తానా అనే హిట్ పాటకు డ్యాన్స్ చేస్తూ ఒక రీల్‌ను షేర్ చేసింది. ఇందులో ఆమె గ్లామరస్ డ్రెస్‌లో హాట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో స్టెప్పులేస్తూ కనిపించింది.ఇందులో ఆమె స్టైలిష్ హాఫ్-టాప్ ధరించి హాట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో చిందులు వేస్తూ కనిపించింది.ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ఇక ఈ వీడియోపై నెటిజన్స్ తమదైన రీతిలో స్పందిస్తున్నారు. కొందరు ఆమె అందాన్ని, డ్యాన్స్‌ను పొగుడుతూ హాట్, సూపర్ అని కామెంట్స్ చేస్తుంటే.. మరికొందరు మాత్రం ఎంత అందాలు ఆరబోసినా పెద్ద ఆఫర్లు రావు, అవకాశాల కోసం ఇంతలా అందాలను బయటపెట్టలా అంటూ ట్రోల్ చేస్తున్నారు. విమర్శలు ఎలా ఉన్నా, కుషిత చేసిన ఈ కొత్త రీల్ మాత్రం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. ఇకపోతే ప్రస్తుతం కుషిత.. చిరు నటిస్తోన్న ఒక సినిమాలో ఛాన్స్ పట్టేసింది. మొన్న చిరు పుట్టినరోజున.. ఆయనతో దిగిన ఫోటోను షేర్ చేస్తూ బర్త్ డి విషెస్ తెలిపింది. మరి ఈ సినిమా ద్వారా అమ్మడు ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.