కొత్త మలుపు ట్రైలర్.. సింగర్ సునీత కొడుకు అదరగొట్టాడుగా
ABN , Publish Date - Jun 07 , 2026 | 09:04 PM
టాలీవుడ్ ప్రముఖ గాయని సునీత (Sunitha) కుమారుడు ఆకాష్ గోపరాజు (Akash Goparaju) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం కొత్త మలుపు (Kotha Malupu). సర్కారు నౌకరి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆకాష్‌కి ఇది రెండో సినిమా.
టాలీవుడ్ ప్రముఖ గాయని సునీత (Sunitha) కుమారుడు ఆకాష్ గోపరాజు (Akash Goparaju) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం కొత్త మలుపు (Kotha Malupu). సర్కారు నౌకరి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆకాష్‌కి ఇది రెండో సినిమా. శివ వరప్రసాద్ కేశనకుర్తి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తథాస్తు క్రియేషన్స్ బ్యానర్‌పై తాటి బాలకృష్ణ నిర్మించాడు. ఇక ఈ చిత్రంలో ఆకాష్ సరసన భైరవి ఆర్థ్యా నటించింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
కొత్త మలుపు సినిమా జూన్ 12న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ విడుదల చేయడంతో ఒక హైప్ క్రియేట్ అయ్యింది. తాజాగా ప్రముఖ దర్శకుడు ఎ. కోదండరామి రెడ్డి చిత్ర ట్రైలర్‌ను విడుదల చేసి చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సినిమా ట్రైలర్ విషయానికి వస్తే.. పూర్తిగా పచ్చని కోనసీమ గ్రామీణ వాతావరణంలో సాగే ఒక అందమైన ప్రేమకథగా కనిపిస్తోంది.
మరదలిని పెళ్లి చేసుకోవడానికి అమెరికా నుంచి వచ్చిన బావకు.. ఇక్కడ పల్లెటూరులో ఆ మరదలు వేరొకరిని ప్రేమిస్తుందని, ఒక్కడినే కాకుండామరొకరితో చాట్ చేస్తోందని తెలుస్తుంది. అప్పుడు ఆ బావ.. మరదలిని అనుమానిస్తాడు. ఇక తన అనుమానం తీర్చుకోవడానికి పాట్లు పడతాడు. ఆ పనుల్లో బావ చేసిన తప్పులు ఏంటి.. ? చివరికి ఈ బావ మరదలు ఒక్కటి అవుతారా.. ? లేదా.. ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. బావమరదళ్ల మధ్య సాగే క్యూట్ రొమాన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్, మంచి హాస్యంతో పాటు కథలో ఒక ఆసక్తికరమైన సస్పెన్స్ ఎలిమెంట్‌ను కూడా జోడించి దర్శకుడు ఈ ట్రైలర్‌ను చాలా ఇంట్రెస్టింగ్‌గా కట్ చేశారు. మరి ఈ సినిమాతో ఆకాష్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.