Sunitha - Suma: మడమ తిప్పమంటున్న ఆ ఇద్దరు యువ హీరోలు!

ABN , Publish Date - Jan 15 , 2026 | 10:08 AM

సింగర్ సునీత కొడుకు ఆకాశ్‌ హీరోగా 2004లో 'సర్కారు నౌకరి' మూవీ వచ్చింది. ఇప్పుడు అతను కథానాయకుడిగా రెండో సినిమా 'కొత్త మలుపు' రూపుదిద్దుకుంది.

Kotha Malupu Movie

స్టార్ యాంకర్ సుమ (Suma), సింగర్ సునీత (Sunitha) తమ వారసులను సినిమాల్లోకి హీరోగా తీసుకొచ్చారు. సుమ కొడుకు రోషన్ హీరోగా 2023లో 'బబుల్ గమ్' మూవీతో ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. అయినా... తిరిగి గత యేడాది చివరిలో 'మోగ్లీ' మూవీలో హీరోగా నటించి సత్తా చాటే ప్రయత్నం చేశాడు. కానీ ఈసారి అతనికి తగిన స్థాయిలో విజయం దక్కలేదు. అయినా అతను తగ్గేదే లే అంటున్నాడు. అలానే సింగర్, మ్యూజిక్ షో న్యాయనిర్ణేత సునీత కొడుకు ఆకాశ్‌ సైతం ఇప్పటికే 'సర్కారు నౌకరి' మూవీలో హీరోగా నటించాడు. ఆ సినిమా 2024 జనవరి 1న విడుదలైంది. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు నిర్మించిన ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ కాలేదు. అయినా మరోసారి ఆకాశ్ హీరోగా తనను తాను నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అదే 'కొత్త మలుపు'. సంక్రాంతి కానుకగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.


kotha malupu movie   (2).jpg

ఆకాశ్‌ సరసన భైరవి అర్థ్యా (Bhairavi Ardhya) హీరోయిన్ గా నటిస్తున్న 'కొత్త మలుపు' మూవీ ఫస్ట్ లుక్ ను జనవరి 14న విడుదల చేశారు. ఈ చిత్రం తధాస్తు క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతోంది. శివ వరప్రసాద్ కేశనకుర్తి దర్శకత్వంలో, తాటి బాలకృష్ణ నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమాలో సీనియర్ నటులు రఘు బాబు, పృధ్వీ, ప్రభావతి తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. దర్శకుడు శివ వరప్రసాద్ కేశనకుర్తి ఈ సినిమా గురించి చెబుతూ, 'రొమాంటిక్ లవ్ సస్పెన్స్‌తో పాటు హాస్యరసాన్ని కలగలిపి ఈ చిత్రాన్ని రూపొందించాం. ఆకాష్, భైరవి జోడీ చాలా చక్కగా కుదిరింది. వీరు బావ, మరదులుగా నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఫస్ట్ లుక్ విడుదల చేశాం. త్వరలోనే సినిమా విడుదలకు సిద్ధమవుతాం' అని చెప్పారు. నిర్మాత తాటి బాలకృష్ణ మాట్లాడుతూ, 'ఈ మూవీని పూర్తిగా విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిస్తున్నాం. గ్రామీణ వాతావరణంలో సాగే కథ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటిస్తాం' అని అన్నారు. ఈ సినిమాకు యశ్వంత్ సంగీతం సమకూర్చుతున్నారు.

Updated Date - Jan 15 , 2026 | 10:08 AM