Kona Venkat: ఆ డైరెక్టర్స్ క్రిమినల్స్.. బ్యాన్ చేయాలి
ABN , Publish Date - Oct 10 , 2026 | 07:24 PM
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, రచయిత కోన వెంకట్ (Kona Venkat) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలో ఎన్నో హిట్ సినిమాలకు కథలను అందించిన కోన తాజాగా కామ్రేడ్ కళ్యాణ్ సినిమాని ప్రెజెంట్ చేశాడు
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, రచయిత కోన వెంకట్ (Kona Venkat) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలో ఎన్నో హిట్ సినిమాలకు కథలను అందించిన కోన తాజాగా కామ్రేడ్ కళ్యాణ్ సినిమాని ప్రెజెంట్ చేశాడు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆయన ప్రస్తుతం ఇండస్ట్రీలో జరుగుతున్న ప్రొడక్షన్ వేస్టేజ్, దర్శకుల ప్లానింగ్ లోపాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కొందరు దర్శకులు మూడు గంటలకు పైగా ఫుటేజ్ తీసి, ఆ తర్వాత గంటల కొద్దీ సీన్లను ఎడిటింగ్ లో లేపేస్తుంటారని, దీనివల్ల కోట్లు ఖర్చు పెట్టిన నిర్మాత మీద విపరీతమైన ఆర్థిక భారం పడుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా సినిమా ఫలితం ఎలా ఉన్నా, సరైన ప్రాపర్ ప్లానింగ్ లేకుండా భారీ బడ్జెట్ తగలేసే వాళ్ళను పరిశ్రమ నుంచి బ్యాన్ చేయాలని, అలాంటి వాళ్ళు క్రిమినల్స్‌తో సమానమని ఆయన చాలా ఘాటుగా విమర్శించారు.
ఇక తాజాగా కామ్రేడ్ కళ్యాణ్ సక్సెస్ మీట్ లో ఆ వ్యాఖ్యలకు వివరణ ఇచ్చారు. సరైన ప్రాపర్ ప్లానింగ్ లేకుండా వందల కోట్లు ఖర్చు పెడుతున్న తీరును తప్పుబట్టిన కోన వెంకట్, ఇలాంటి పద్ధతులు మార్చుకోకపోతే నిర్మాతలు రోడ్డున పడే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. 'సినిమా ఫలితం మన చేతిలో ఉంటుందా? ఉండదు. కానీ ప్లానింగ్ మన చేతిలో ఉంటుంది కదా! ప్రాపర్ ప్లానింగ్ లేకుండా, బడ్జెట్ ఎంతవుతుందనే స్పష్టత లేకుండా ఇలా ఇష్టారీతిన సినిమాలు తీసేవాళ్లను పరిశ్రమ నుంచి బ్యాన్ చేయాలి. వీళ్ళు క్రిమినల్స్‌తో సమానం. నిర్మాత ప్రాణాలు తీసే హక్కు ఎవరికీ లేదు'.
ఒకప్పుడు నెగటివ్ రీల్స్ ఖర్చు ఉండేది కాబట్టి ఆచితూచి షూటింగ్ చేసేవారని, ఇప్పుడు డిజిటల్ యుగంలో ఆ నియంత్రణ తగ్గిపోయిందని ఆయన అభిప్రాయపడ్డారు. సెట్స్‌కి వెళ్లే ముందే స్క్రిప్ట్ వర్క్, లొకేషన్ హంట్స్ అన్నీ పక్కాగా సిద్ధం చేసుకోవాలని, కెమెరా ఆన్ అయ్యాక నిత్యం మార్పులు చేసే ధోరణి వీడాలని ఆయన సూచించారు. కామ్రేడ్ కళ్యాణ్ సక్సెస్ మీట్ వేదికగా కోన వెంకట్ మాట్లాడిన ఈ విషయాలు ప్రస్తుతం టాలీవుడ్‌లోని నిర్మాతలు, దర్శకుల మధ్య పెద్ద చర్చకు దారితీశాయి. సినిమా మేకింగ్ కాస్ట్ తగ్గాలంటే ప్రతి ఒక్కరూ ప్రొడక్షన్ వాల్యూస్‌ని, ప్లానింగ్‌ని గౌరవించాలని ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. కెమెరా ఆన్ అయ్యాక రోజుకో మార్పులు చేసి హీరోలను, నిర్మాతలను ఇబ్బంది పెట్టే ధోరణి మారాలని, అప్పుడే నిర్మాతలు సేఫ్ జోన్‌లోకి వస్తారని టాలీవుడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.