Ramesh Varma: మనస్విని బాలబొమ్మల అతిథి పాత్రతో 'కొక్కొరొకో'

ABN , Publish Date - Jan 15 , 2026 | 05:49 PM

రమేశ్‌ వర్మ నిర్మిస్తున్న 'కొక్కొరొకో' చిత్రం షూటింగ్ పూర్తయ్యింది. సమ్మర్ స్పెషల్ గా రాబోతున్న ఈ చిత్రంలో టాలెంటెడ్ గర్ల్ మనస్విని బాలబొమ్మల ఓ ప్రత్యేక పాత్రను పోషించింది. సంగీతం, పేరిణీ నృత్యంతో పాటు రంగస్థలం మీద నటించిన అనుభవం మనస్విని సొంతం.

Manaswini Balabommala in Kokkoroko

యంగ్ టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేస్తూ ప్రముఖ దర్శకుడు రమేశ్‌ వర్మ (Ramesh Varma) నిర్మించిన 'కొక్కొరొకో' (Kokkoroko) చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాను సమ్మర్ స్పెషల్ విడుదల చేయబోతున్నారు. శ్రీనివాస్ వసంతల దర్శకుడిగా ఈ యాంథాలజీ మూవీతో పరిచయం అవుతున్నాడు. ఐదు విభిన్న పాత్రల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రముఖ రచయిత, స్వర్గీయ సత్తమూర్తి (Satyamurthy) కొడుకు, దేవిశ్రీ ప్రసాద్ (Devisri Prasad) సోదరుడు, గాయకుడు జీవీ సాగర్ ఈ సినిమాకు సంభాషణలు రాయడం విశేషం. 'రాక్షసుడు' సినిమా తర్వాత జీవీ సాగర్ సంభాషణలు రాసిన రెండో సినిమా ఇదే. ఆకాశ్‌ ఆర్ జోషి ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ అందిస్తుండగా లండన్ కు చెందిన ఫ్యాషినేట్ మ్యూజిక్ డైరెక్టర్ సంకీర్తన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రానికి రేఖావర్మ, కురపాటి శిరీష నిర్మాతలు వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకు కథతో పాటు గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే ను రమేశ్ వర్మ అందించాడు.


WhatsApp Image 2026-01-15 at 1.00.42 PM (1).jpeg

ఇదిలా ఉంటే ఈ సినిమాతో టాలెంటెడ్ గర్ల్ మనస్విని బాలబొమ్మల (Manaswini Balabommala) ప్రత్యేకపాత్రతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇస్తోంది. సినిమాల్లోకి రాకముందే మనస్విని రంగస్థలం మీద తన సత్తాను చాటుకుంది. 'లిటిల్ ఉమెన్, మచ్ అడో అబౌట్ నథింగ్' వంటి నాటకాల్లో ఆమె కీలక పాత్రలను పోషించింది. నటనతో పాటుగా పేరణి నృత్యంలోనూ మనస్విని శిక్షణ తీసుకుంది. అలానే కర్ణాటక సంగీతంలోనూ అనుభవాన్ని సంపాదించుకుంది. స్కూల్ ఈవెంట్స్ లోనూ, భక్తి కార్యక్రమాల్లోనూ పాల్గొన్న అనుభవం మనస్వినికి ఉంది. ఈ సినిమా తర్వాత మనస్విని కి తెలుగులో మరిన్ని అవకాశాలు వస్తాయని మేకర్స్ చెబుతున్నారు.

Updated Date - Jan 15 , 2026 | 05:51 PM