Ram Charan: చరణ్ ఫోన్ వాల్ పేపర్ పై క్లింకార.. ఎంత ముద్దుగుందో
ABN , Publish Date - Jan 09 , 2026 | 08:19 PM
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan).. ప్రస్తుతం హీరోగా కంటే తండ్రిగానే ఎక్కువగా కనిపిస్తున్నాడు. చరణ్ - ఉపాసనకు పెళ్ళైన పదేళ్ల తరువాత క్లింకార (Klinkara Konidela) జన్మించింది.
Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan).. ప్రస్తుతం హీరోగా కంటే తండ్రిగానే ఎక్కువగా కనిపిస్తున్నాడు. చరణ్ - ఉపాసనకు పెళ్ళైన పదేళ్ల తరువాత క్లింకార (Klinkara Konidela) జన్మించింది. మెగా వారసురాలు వచ్చిన దగ్గరనుంచి మెగా ఫ్యామిలీ రేంజే మారిపోయింది. ఈ చిన్నారి పుట్టినప్పటి నుంచి మెగా ఫ్యామిలీకి అన్ని మంచి శకునాలే అని చెప్పొచ్చు. ఇక క్లింకార పుట్టి మూడేళ్లు అవుతుంది. ఇప్పటివరకు చిన్నారి ముఖాన్ని మాత్రం చరణ్ దంపతులు అభిమానులకు చూపించలేదు. ఎప్పుడైనా వారసురాలి ఫోటో కనిపిస్తుందా అని మెగా ఫ్యాన్స్ అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
ఇక రామ్ చరణ్ .. తనను క్లింకార ఎప్పుడైతే నాన్న అని పిలుస్తుందో అప్పుడు తన ఫేస్ ని రివీల్ చేస్తానని చెప్పుకొచ్చాడు. కూతురు జన్మించాకా.. చరణ్ లైఫ్ మారిపోయింది. ఎక్కువ సమయం చిన్నారితోనే గడుపుతున్నాడు. క్లింకార కూడా తండ్రి తినిపిస్తే తప్ప తినదు అని, అలా కూతురును చూసుకోవడం చరణ్ కి తప్ప ఇంకెవరికి రాదనీ తల్లి సురేఖ కితాబులు కూడా ఇచ్చేసింది. ఇక క్లింకార, చరణ్ బాండింగ్ చాలా అద్భుతంగా ఉంది అని చెప్పడానికి ఈ ఒక్క వాల్ పేపర్ చాలు అని మెగా ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు.
తాజాగా రామ్ చరణ్.. సూరత్ లో జరుగుతున్న ISPL సీజన్ 3 ఓపెనింగ్ ఈవెంట్ కి అటెంట్ అయ్యాడు. అక్కడ బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్, స్టార్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ను చరణ్ మీట్ అయ్యాడు. ఇక ఆ సమయంలోనే కెమెరాలకు పోజులు ఇచ్చాడు. అప్పుడే చరణ్ ఫోన్ వాల్ పేపర్ కెమెరా కంట పడింది. అందులో క్లింకార.. చరణ్ మెడలపై కూర్చొని చిరునవ్వులు చిందిస్తుంది.
ఇక ఈ ఫోటో రీసెంట్ ఫోటో అని చరణ్ లుక్ చెప్తుంది. వైట్ కలర్ గౌన్ లో తండ్రి మెడలపై కూర్చొని క్లింకార.. అతని జుట్టుతో ఆడుకుంటూ ఉండగా.. చరణ్ కూడా నవ్వులు చిందిస్తున్నాడు. ఫోటో బ్లర్ గా ఉన్నా కూడా క్లింకార చాలా ముద్దుగా ఉంది అని మెగా ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. తండ్రీ కూతుళ్ల బంధం ఎప్పటికీ స్పెషల్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఉపాసన రెండోసారి ప్రెగ్నెంట్ గా ఉంది. ఈసారి ఈ జంట ట్విన్స్ కి జన్మనిస్తుందని తెలుస్తోంది. మరి ఈసారి మెగా వారసుడు జన్మిస్తాడేమో చూడాలి.