KA14: పూజా కార్యక్రమాలతో కిరణ్ అబ్బవరం ‘రికార్డ్’ ప్రారంభం
ABN , Publish Date - Nov 23 , 2026 | 02:31 PM
కిరణ్ అబ్బవరం హీరోగా నటించనున్న 14వ సినిమా ‘రికార్డ్’ సోమవారం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది.
కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయన హీరోగా నటించనున్న 14వ సినిమా ‘రికార్డ్’ (Record) సోమవారం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. వీరా కొగటం దర్శకుడిగా పరిచయం కానున్నారు.వంశీ నందిపాటి ఎంటర్టైన్మెంట్స్, సుకుమార్ రైటింగ్స్, ది స్టోరీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు సుకుమార్‌తో పాటు నిర్మాతలు దిల్ రాజు, బన్నీ వాసు, ఏషియన్ సునీల్ నారంగ్ తదితర సినీ ప్రముఖులు హాజరయ్యారు.పూజా కార్యక్రమాల అనంతరం ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత దిల్ రాజు క్లాప్ కొట్టారు. సుకుమార్ కెమెరా స్విచాన్ చేశారు. బన్నీ వాసు గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాతలు డీవీవీ దానయ్య, దిల్ రాజు చిత్ర యూనిట్‌కు స్క్రిప్ట్‌ను అందజేశారు. ఈ సందర్భంగా విడుదల చేసిన టైటిల్ పోస్టర్ ఆసక్తికరంగా ఉంది.
హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ "సుకుమార్ గారితో అసోసియేషన్... వంశీ నందిపాటి గారితో 'క' తరువాత మళ్లీ అసోసియేషన్ అవ్వడం..అశోక్ బండ్రెడ్డి కూడా ఈసినిమాకు నిర్మాత కావడం.. మంచి సినిమా అందిస్తామనే నమ్మకం కుదిరింది. టైటిల్ రికార్డ్ తో పాటు సినిమా కూడా అందరికి నచ్చుతుంది. 18 సంవత్సరాలు మీడియాలో పనిచేసిన వీర ఈ సినిమాతో దర్శకుడు అవుతున్నాడు. ఈ కథను వీర ఎంతో అద్భుతంగా డెలీవరి చేస్తాడనే నమ్మకం ఉంది. ఈ సినిమా అందరూ గర్వపడే సినిమా అవుతుంది' అన్నారు.
నిర్మాత వంశీ నందిపాటి మాట్లాడుతూ '' కిరణ్ అబ్బవరం గారితో చేస్తున్న ఈ 'రికార్డ్' సినిమా ఇండస్ట్రీలోని రికార్ట్లన్నీ బద్దలు కొట్టాలని కోరుకుంటున్నాను. ఓ మంచి సినిమాను అందిస్తున్నాం. సుకుమార్ రైటింగ్స్‌తో అసోసియేట్ అవ్వడం నా కల నెరవేరినట్లుగా అనిపిస్తుంది" అన్నారు.
దర్శకుడు వీర కోగటం మాట్లాడుతూ "కర్నూలు కొండారెడ్డి బూరుజు సాక్షిగా ఓ మంచి సినిమా ఇస్తున్నానని నమ్మకంగా చెబుతున్నాను' అన్నారు.