పిఆర్ టీమ్ తో హిట్ కొట్టాడు.. కిరణ్ అబ్బవరం ఏమన్నాడంటే

ABN , Publish Date - Jul 28 , 2026 | 04:41 PM

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram), శ్రీ గౌరి ప్రియ (Sri Gouri Priya) జంటగా నటించిన చిత్రం చెన్నై లవ్ స్టోరీ(Chennai Lovestory).

Kiran Abbavaram

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram), శ్రీ గౌరి ప్రియ (Sri Gouri Priya) జంటగా నటించిన చిత్రం చెన్నై లవ్ స్టోరీ(Chennai Lovestory). రవి నంబూరి దర్శకత్వంలో మాస్ మూవీ మేకర్స్, అమృత ప్రొడక్షన్స్ బ్యానర్లపై నిర్మాతలు ఎస్‌కేఎన్ (SKN) మరియు సాయి రాజేష్ నిర్మించిన ఈ రొమాంటిక్ డ్రామా జూలై 24న రిలీజ్ అయ్యి బ్లాక్‌బస్టర్ టాక్‌తో మంచి వసూళ్లతో దూసుకుపోతోంది. దీంతో మేకర్స్ చెన్నై లవ్ స్టోరీ సక్సెస్ మీట్ ని నిర్వహించారు. ఈ ఈవెంట్ కి అక్కినేని నాగచైతన్య ముఖ్య అతిధిగా విచ్చేశాడు. దానికి ముందు విలేకరులు అడిగిన ప్రశ్నలకు కిరణ్ అబ్బవరం అద్భుతంగా సమాధానాలు ఇచ్చాడు.


ఇక చెన్నై లవ్ స్టోరీ హిట్ అవ్వడానికి కిరణ్ పిఆర్ టీమ్ కారణమని ట్రోల్స్ వచ్చాయి. కిరణ్ తన రెమ్యూనరేషన్ లో కొంత.. పిఆర్ టీమ్ కి ఇచ్చి టికెట్స్ కొనిచ్చాడని, అందుకే థియేటర్లు కళకళలాడుతున్నాయని మీమ్స్ వచ్చాయి. ఇక ఇదే విషయం గురించి ఒక రిపోర్టర్ సక్సెస్ మీట్ లో 'సినిమా హిట్ అయిన తర్వాత పిఆర్ (PR) టీమ్ వల్లే ఈ హిట్ వచ్చింది, పిఆర్ టీమ్‌తోనే హిట్ కొట్టారు అని మీమ్స్ వస్తున్నాయి.. దీనిపై మీ స్పందన ఏంటి?' అని కిరణ్ అబ్బవరంని అడిగాడు. అయితే ఇలాంటి ప్రశ్నను వదిలేయాలి అని పక్కవారు అంటున్నా.. కిరణ్ ముందుకు వచ్చి ఇలాంటివి వదిలేయకూడదు. క్లారిటీ ఇవ్వాలని తనదైన శైలిలో ఆ ప్రశ్నకు ఆన్సర్ ఇచ్చాడు.


'పిఆర్ టీమ్‌తోనే హిట్లు కొట్టేటట్లయితే ప్రతి సినిమా అందరూ కొడతారు కదండి. ఎప్పుడు ఏదో ఒక సక్సెస్ వచ్చినప్పుడు ఎవరో ఒకరిని ఏదో ఒక మాట అనాలన్న థింగ్ ఐతే అనకండి. ఏ సినిమా అయినా పిఆర్‌తో ఎవరు ఎంత రుద్దినా ఏమీ అవ్వదు, మనం ఆడియన్స్‌ని, వాళ్ల తీర్పుని రెస్పెక్ట్ చేద్దాం. చెన్నై లవ్ స్టోరీ సినిమాకి థియేటర్లలో 60% ఫ్యామిలీస్ ఉన్నారు, వాళ్ళు ట్విట్టర్‌లో ఉండేవాళ్లు కాదు.. కేవలం మౌత్ టాక్‌తో థియేటర్లకు వచ్చినవాళ్లు. ఏదో ఒకటి అనాలని అనడం చాలా ఈజీ, కానీ సక్సెస్ వచ్చినప్పుడు ఇలాంటివి ఉంటాయి.


నాకు మొదటి సినిమా నుంచి ఇదంతా కొత్తేమీ కాదు. నాకు తెలిసింది ఒకటే.. కష్టపడాలి, నిజాయితీగా ఉండాలి, అదే సక్సెస్ ఇస్తుంది. దయచేసి ఆడియన్స్‌ని, వాళ్ల రివ్యూని రెస్పెక్ట్ చేయండి. పిఆర్ తోనే వస్తుందంటే అందరి దగ్గర కోట్ల డబ్బులు ఉంటాయి, అందరికన్నా నా దగ్గర తక్కువ ఉన్నాయి.. అలా అయితే అందరి సినిమాలు రూ. 200 కోట్లు, రూ.300 కోట్లు రావాలి కదా. కాబట్టి ఊరికే పిఆర్ అని ప్రచారం చేయవద్దని కోరుతున్నాను' అని కిరణ్ చెప్పుకొచ్చాడు.

Updated Date - Jul 28 , 2026 | 04:45 PM