కిరణ్ అబ్బవరం హీరోగా.. భారీ పాన్ ఇండియా మూవీ
ABN , Publish Date - Feb 10 , 2026 | 08:17 AM
టాలీవుడ్ యువ హీరో కిరణ్ అబ్బవరం ప్రధాన పాత్రలో ఓ భారీ పాన్-ఇండియా ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటోంది.
టాలీవుడ్ యువ హీరో కిరణ్ అబ్బవరం ప్రధాన పాత్రలో ఓ భారీ పాన్-ఇండియా ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటోంది. ప్రముఖ నిర్మాత ప్రేరణ అరోరా (Ess Kay Gee Entertainment), జీ స్టూడియోస్ అధినేత ఉమేష్ బన్సాల్ కలిసి ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మించనున్నారు. కీర్తన్ సహ నిర్మాత. కాగా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల నేపథ్యంతో రూపొందే ఈ సినిమా మైథాలజీ యాక్షన్ ఎంటర్టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది.
భారీ విజువల్స్, వినూత్న వరల్డ్ బిల్డింగ్‌థో ఈ చిత్రం తెరకెక్కనుంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. హై టెక్నికల్ స్టాండర్డ్స్‌తో సినిమాను తెరకెక్కించే దిశగా మేకర్స్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. సెప్టెంబర్‌లో షూటింగ్ ప్రారంభించే అవకాశం ఉంది.
హీరోయిన్‌గా బాలీవుడ్, టాలీవుడ్‌కు చెందిన ఓ ప్రముఖ నటిని కథానాయికగా తీసుకునే అవకాశాలు ఉన్నాయి. టైటిల్, దర్శకుడు, ఇతర నటీనటులు, టెక్నికల్ టీమ్ ఇతరత్రా వివరాలన్నింటినీ త్వరలో అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఇదిలాఉంటే కిరణ్ అబ్బవరం గత దీపావళికి కే ర్యాంప్ సినిమాతో ప్రేక్షకుల ఎదుటకు వచ్చి మంచి విజయం సొంతం చేసుకోగా త్వరలో చెన్నై లవ్‌స్టోరి అనే సినిమాతో ప్రేక్షకుల ఎదుటకు రానున్నాడు.