Kiran Abbavaram: అది ఎందుకు అంటే దూల అంతే
ABN , Publish Date - Jul 15 , 2026 | 09:23 PM
టాలీవుడ్ యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) క సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ సినిమా ఇచ్చిన జోష్ తో మంచి మంచి కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులకు దగ్గరవుతున్నాడు.
టాలీవుడ్ యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) క సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ సినిమా ఇచ్చిన జోష్ తో మంచి మంచి కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులకు దగ్గరవుతున్నాడు. ఒకపక్క హీరోగా చేస్తూనే ఇంకోపక్క నిర్మాతగా మారి చిన్న చిన్న సినిమాలతో కొత్త నటులకు ఛాన్స్ ఇస్తున్నాడు. ఇక హీరో, నిర్మాతగానే కాకుండా కిరణ్ తాజాగా సరికొత్త అవతారమెత్తి అందరినీ సర్ప్రైజ్ చేస్తున్నాడు. కేవలం నటుడిగానే కాకుండా మొదటిసారిగా మెగాఫోన్ పట్టి ఆయన దర్శకత్వం వహిస్తున్న లేటెస్ట్ చిత్రం KA 13. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ శరవేగంగా సాగుతున్నాయి. ఇక ఈ సినిమా పక్కన పెడితే.. ఆయన నటించిన చెన్నై లవ్ స్టోరీ సినిమా జులై 24 న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్ స్పీడు పెంచిన కిరణ్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు.
ఇక ఆ ఇంటర్వ్యూలో పాల్గొన్న కిరణ్ అబ్బవరం.. సినిమా విశేషాలతో పాటు తన డైరెక్షన్ ఎంట్రీ గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. అయితే, ఈ ఇంటర్వ్యూలో యాంకర్ అడిగిన ఒక ప్రశ్నకు కిరణ్ ఇచ్చిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. 'ప్రస్తుతం మీరు హీరోగా ఇండస్ట్రీలో చాలా బాగున్నారు కదా, అలాంటప్పుడు హఠాత్తుగా మీకు అస్సలు డైరెక్టర్ అవ్వాలని ఎందుకు అనిపించింది?' అన్న ప్రశ్నకు కిరణ్ ఏమాత్రం తడుముకోకుండా చాలా బోల్డ్‌గా, క్యాజువల్ స్టైల్‌లో దూల.. దూల అంతే అంటూ నవ్వుతూ సమాధానం చెప్పాడు. ప్రతి డైరెక్టర్ ఫస్ట్ షాట్ 9 గంటలకు పెడుతుంటే.. మీరు 7 గంటలకే పెడుతున్నారట అంటే.. నాకు అయితే 7 గంటలకు మొదటి షాట్ పడాల్సిందే అని చెప్పుకొచ్చాడు. కిరణ్ అబ్బవరం తన మనసులో మాటను ఎలాంటి ఫిల్టర్ లేకుండా ఇంత ఓపెన్‌గా చెప్పడం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
హీరోగా మంచి ఫామ్‌లో ఉంటూనే, కేవలం కథపై ఉన్న పట్టుతో, సినిమాపై ఉన్న విపరీతమైన ప్యాషన్‌తోనే ఆయన KA 13 చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నట్లు ఈ సమాధానం ద్వారా స్పష్టమవుతోంది. తనదైన మార్క్ లవ్ స్టోరీతో ఈ చిత్రాన్ని కిరణ్ అబ్బవరం చాలా పక్కాగా తెరకెక్కిస్తున్నట్లు ఇండస్ట్రీ టాక్. హీరోగా మెప్పించిన కిరణ్, ఇప్పుడు డైరెక్టర్‌గా తన దూలను తీర్చుకుంటూ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేయబోతున్నారో చూడాలని ఆయన ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.