Biggboss 10: బిగ్‌బాస్‌ సీజన్‌ 10.. కొత్త తరహాలో..

ABN , Publish Date - Jun 07 , 2026 | 03:22 PM

బిగ్‌బాస్‌ (Biggboss 10) తెలుగు రియాలిటీ షో గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇప్పటికే 9 సీజన్‌లతో ప్రేక్షకులను అలరించింది.

బిగ్‌బాస్‌ (Biggboss 10) తెలుగు రియాలిటీ షో గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇప్పటికే 9 సీజన్‌లతో ప్రేక్షకులను అలరించింది. త్వరలో10వ సీజన్‌ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని చెబుతూ ‘స్టార్‌ మా’ (Starmaa) ఓ వీడియో రిలీజ్‌ చేసింది. ఈ సారి కూడా హోస్ట్‌గా అక్కినేని నాగార్జున వ్యవహరించనున్నారు. ‘బిగ్‌బాస్‌.. ఎన్నో యుద్థాలు గెలుచుకున్న రాజ్యం మాత్రమే కాదు, ఎంతోమంది హృదయాలను గెలుచుకున్న మహా సామ్రాజ్యం’ అంటూ నాగార్జున చెప్పే డైలాగ్‌తో టీజర్‌ మొదలైంది. దీనిలో ఓ పాటను కూడా చిత్రీకరించారు ఈ సారి ‘ఆటలో సవాల్‌ కాదు.. ఆటే సవాల్‌’ అన్న క్యాప్షన్‌ షో రసవత్తరంగా ఉండబోతుందో చెప్పారు కింగ్‌ నాగ్‌.

గత సీజన్‌లో సెలబ్రిటీలతోపాటు సామాన్యులకూ అవకాశం ఇచ్చారు. అగ్ని పరీక్షను దాటుకుని మరీ ఆరుగురు.. బిగ్‌బాస్‌ ఇంట్లో అడుగుపెట్టి ప్రతిభను చూపించారు. సెలబ్రిటీలకు గట్టి పోటీ ఇచ్చారు. ఫైనల్‌గా కామన్‌మ్యాన్‌ కల్యాణ్‌ పడాల సీజన్‌ విజేతగా నిలిచారు. ఈసారి షోలో ఎవరికి అవకాశం ఇస్తారో చూడాలి.

Updated Date - Jun 07 , 2026 | 04:18 PM