విద్యార్థి నేతల కిడ్నాప్.. మంచు విష్ణుకు నోటీసులు
ABN , Publish Date - Feb 08 , 2026 | 12:45 PM
విద్యార్థి నేతల కిడ్నాప్ కేసులో మంచు విష్ణుకు నోటీసులు.. మోహన్ బాబు విశ్వవిద్యాలయంలో విద్యార్థి నేతల కిడ్నాప్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది
మంచు మోహన్ బాబు (Mohan Babu) విశ్వవిద్యాలయానికి సంబంధించి విద్యార్థి నేతల కిడ్నాప్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. నటుడు, 'మా' అధ్యక్షుడు మంచు విష్ణుకు (Manchu Vishnu) చంద్రగిరి పోలీసులు ఆదివారం నోటీసులు ఇచ్చారు. కిడ్నాప్ ఆరోపణల నేపథ్యంలో విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు. మొత్తంగా పోలీసులు రెండు నోటీసులు ఇచ్చారు.
విద్యార్థి సంఘాల నేతలపై ఇచ్చిన ఫిర్యాదులో ఆధారాలు సమర్పించాలని చంద్రగిరి పోలీసులు నోటీసులు జారీ చేశారు. అలాగే మరోవైపు విద్యార్థి సంఘాల నేతల కిడ్నాప్ కేసులో విచారణకు హాజరు కావాలంటూ తిరుచానూరు పోలీసులు నోటీసులో పేర్కొన్నారు. ఈ కేసులో మంచు విష్ణును ఏ2గా, మంచు మోహన్ బాబును ఏ3గా చేర్చారు. కిడ్నాప్ కేసులో పీఆర్వో సతీశ్(A1)తో పాటు పలువురు బౌన్సర్లు ఇప్పటికే అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై ఇప్పటికే ఏపీ హైకోర్టులో మంచు మోహన్ బాబు క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.