Kick Shaam: విజయ్‌ స్థానంలో ఎవరున్నా.. ఇలా చేయరు..

ABN , Publish Date - May 07 , 2026 | 03:11 PM

టీవీకే పార్టీ అధినేత విజయ్‌ సాధించిన విజయం గురించి నటుడు కిక్‌ శ్యామ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన ఘన విజయం సాధిస్తారని ముందే తెలుసని అన్నారు.

టీవీకే పార్టీ అధినేత విజయ్‌ (TVK VIjay) సాధించిన విజయం గురించి నటుడు కిక్‌ శ్యామ్‌ (kick Shaam) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన ఘన విజయం సాధిస్తారని ముందే తెలుసని అన్నారు. ఆయన పార్టీ పెట్టిన కొన్ని నెలలకే సక్సెస్‌ను ఊహించానని ఆయన పేర్కొన్నారు. వీరిద్దరూ కలిసి ‘వారసుడు’ చిత్రంతో అన్నదమ్ములుగా నటించారు. ‘విజయ్‌ ఎంతో నిబద్థత గల వ్యక్తి అని, అన్నయ్యలాంటివారని కొనియాడారు.

ఇంకా చెబుతూ ‘విజయ్‌ నిజయతీకి మారుపేరు. తాను ఎక్కిన ప్రతి మెట్టుకు కారణం అభిమానులేనని తరచూ చెబుతుంటారు. ఆ ప్రేమను తిరిగి ఇవ్వడానికే తాను ఏదైనా చేయాలనుకుంటున్నట్లు ఎన్నోసార్లు చెప్పారు. ‘మీరు ఇంతపెద్ద స్టార్‌ అవుతారనుకున్నారా? అని ఓ సందర్భంలో నేనే ఆయన్ను అడిగా. ‘నేను హీరో అయితే చాలు అనుకొని సినిమాల్లోకి వచ్చాను. ఇంతటి ప్రేమాభిమానాలని పొందుతానని అనుకోలేదు’ అని విజయ్‌ అన్న చెప్పారు.

తమిళనాడు ఎన్నికల్లో గెలుపొందడం గురించి మాట్లాడుతూ ‘విజయ్‌ వెనక ఓ దైవశక్తి ఉంది. అదే అతన్ని ఇక్కడి దాకా తీసుకొచ్చింది. ఆయన విజయాన్ని ఓ రోజులు ఆయన ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నట్లు, ప్రజలు గౌరవిస్తున్నట్లు నాకు కల వచ్చింది. అదే విషయాన్ని ఓ రోజు ఉదయాన్నే ఫోన్‌ చేసిన విజయ్‌కు చెప్పా. నా కల నిజం కాబోతోందని మే 3న మెసేజ్‌ పంపాను. నా ఆలోచనలు రాత్రికి రాత్రే వచ్చినవి కావు. ఆయనను ఏదో ఒక దైవ శక్తి నడిపిస్తోందని నేను బలంగా నమ్ముతా. ఆ రాజకీయ సింహాసనం ఆయనకు చెందుతుందని నాకు నమ్మకం ఉంది. ఆయన స్థానంలో ఎవరు ఉన్నా సినిమా కెరీర్‌ వదులుకుని రాజకీయాల్లోకి రారు’ అని అన్నారు.

Updated Date - May 07 , 2026 | 03:45 PM