శ్రీకృష్ణ దేవరాయలుగా.. కిచ్చా సుదీప్! గ్లింప్స్ అదిరింది
ABN , Publish Date - Sep 02 , 2026 | 11:57 AM
టాలీవుడ్‌లో మరో ఆసక్తికరమైన భారీ బడ్జెట్ అడ్వెంచరస్ పాన్ ఇండియా పిరియాడికల్ చిత్రానికి అంకురార్పణ జరిగింది.
టాలీవుడ్‌లో మరో ఆసక్తికరమైన భారీ బడ్జెట్ అడ్వెంచరస్ పాన్ ఇండియా పిరియాడికల్ చిత్రానికి అంకురార్పణ జరిగింది. ఐదు శతాబ్దాల క్రితం దక్షిణాది ప్రాంతాన్ని తిరుగులేని చక్రవర్తిగా ఏలిన శ్రీ కృష్ణ దేవరాయలు (SRI KRISHNA DEVARAAYA) కథ నేపథ్యంలో దేవరాయ (Devaraaya) సినిమా తెరకెక్కుతోంది. శాండిల్ వుడ్ అగ్ర నటుడు కిచ్చా సుదీప్ (KicchaSudeep) టైటిల్ రోల్ చేస్తున్నాడు.
ఈ రోజు (బుధవారం) సుదీప్ జన్మదినాన్ని పురస్కరించుకుని మేకర్స్ విడుదల చేసిన గ్లింప్స్ సామాజిక మాధ్యమాలను దున్నేస్తోంది. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా (People Media Factory) బ్యానర్‌పై సుప్రియాన్వీ పిక్చర్ స్టూడియో (Supriyanvi Picture Studio)తో కలిసి టీజీ విశ్వ ప్రసాద్ (TG Vishwa Prasad), కృతి ప్రసాద్ (Krithi Prasad ) నిర్మిస్తున్నారు. గౌర హరి (Gowra Hari) సంగీతం అందిస్తున్నాడు. కాగా ఈ మూవీని 2027 డిసెంబర్‌లో ప్రేక్షకుల ఎదుటకు తీసుకురానున్నట్లు మేకర్స్ ప్రటించారు.