వెంకీ అనిల్ సినిమా రీమేక్.. కీర్తి సురేష్ ఏం చెప్పిందంటే
ABN , Publish Date - Jul 04 , 2026 | 05:04 PM
టాలీవుడ్‌లో విక్టరీ వెంకటేష్ (Venkatesh), హిట్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi)ల కాంబినేషన్‌కు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీరిద్దరి కాంబోలో గతంలో వచ్చిన F2, F3, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు బాక్సాఫీస్ వద్ద నవ్వుల జాతర సృష్టించి బ్లాక్‌బస్టర్ హిట్స్‌గా నిలిచాయి.
టాలీవుడ్‌లో విక్టరీ వెంకటేష్ (Venkatesh), హిట్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi)ల కాంబినేషన్‌కు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీరిద్దరి కాంబోలో గతంలో వచ్చిన F2, F3, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు బాక్సాఫీస్ వద్ద నవ్వుల జాతర సృష్టించి బ్లాక్‌బస్టర్ హిట్స్‌గా నిలిచాయి. ఇప్పుడు వీరిద్దరి కలయికలో ఐదో ప్రాజెక్ట్‌గా వెంకీ అనిల్ 5 అనే సరికొత్త క్రైమ్ కామెడీ డ్రామా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో వెంకటేష్ తో పాటు నందమూరి కళ్యాణ్ రామ్ మరో హీరోగా కనిపిస్తోండగా.. కీర్తి సురేష్, కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తోన్నారు. ఇప్పటికే పూజా కార్యక్రమాలను పూర్తిచేసుకున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకొంటుంది.
అయితే, గత కొన్ని రోజులుగా ఈ సినిమా గురించి ఇండస్ట్రీలో ఒక గట్టి పుకారు విపరీతంగా చక్కర్లు కొడుతోంది. మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్, బాసిల్ జోసెఫ్ ప్రధాన పాత్రల్లో నటించి ఘనవిజయం సాధించిన గురువాయూర్ అంబలనాడైల్ చిత్రానికి ఇది అఫీషియల్ తెలుగు రీమేక్ అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు ప్రచారమయ్యాయి. అందులో బావ బామ్మర్దులుగా వెంకీ- కళ్యాణ్ రామ్ కనిపించనున్నారని టాక్ నడిచింది. ఇద్దరు హీరోయిన్లు కూడా ఉండడంతో అందరూ నిజమే అనుకున్నారు.
ఇక ఈ క్రేజీ రీమేక్ పుకార్లపై కీర్తి సురేష్ తాజాగా స్పందించి గట్టి క్లారిటీ ఇచ్చింది. వెంకీ- అనిల్ 5 సినిమా గురువాయూర్ అంబలనాడైల్ చిత్రానికి రీమేక్ అని సోషల్ మీడియాలో వచ్చిన ఒక పోస్ట్ కి ఆమె రిప్లై ఇచ్చింది. సోషల్ మీడియాలో వస్తున్న ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని కుండబద్దలు కొట్టింది. వెంకటేష్-అనిల్ రావిపూడి సినిమా మలయాళం సూపర్ హిట్ చిత్రానికి రీమేక్ ఎంతమాత్రం కాదని తెలిపింది. దీంతో గత కొన్ని రోజులుగా ఈ ప్రాజెక్ట్‌పై వస్తున్న రీమేక్ రూమర్స్‌కు పూర్తిగా ఎండ్ కార్డ్ పడినట్లయింది. మరి ఈ సినిమాతో అనిల్ రావిపూడి ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.