Keerthy Suresh: నానితో కీర్తి సాంగ్.. రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవుతారు..  

ABN , Publish Date - Aug 01 , 2026 | 10:46 AM

నేచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంటకు టాలీవుడ్‌లో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. వీరిద్దరూ కలిసి నటించిన, 'నేను లోకల్', ‘దసరా’ చిత్రాలు ఎంతగా విజయం సాధించాయో తెలిసిందే. 

నేచురల్ స్టార్ నాని(Nani), కీర్తి సురేష్ (Keerthy Suresh) జంటకు టాలీవుడ్‌లో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. వీరిద్దరూ కలిసి నటించిన, 'నేను లోకల్', ‘దసరా’ చిత్రాలు ఎంతగా విజయం సాధించాయో తెలిసిందే. ఇప్పుడు ఈ  కాంబినేషన్ మరోసారి తెరపై కనిపించబోతుందనే వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈసారి కీర్తి సురేష్ పూర్తి స్థాయి హీరోయిన్‌గా కాకుండా, ‘ది ప్యారడైజ్’ (The Paradise) చిత్రంలో ప్రత్యేక గీతంలో కనిపించనున్నారట. అయితే దీనికి సంబంధించి కూడా ఓ వార్త వైరల్ అవుతోంది. ఈ స్పెషల్ సాంగ్ కోసం కీర్తి కేవలం రెండు రోజుల కాల్‌షీట్స్  కేటాయించారట.  రెండు రోజుల కాల్‌షీట్స్‌కే భారీ రెమ్యునరేషన్ అందుకుంటున్నారనే వార్తలు ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ అవుతున్నాయి. అయితే ఎంత అనేది బయటకు రాలేదు కానీ.. భారీ రెమ్యూనరేషన్ అందుకోబోతోందని మాత్రం తెలుస్తోంది. 

ఈ పాటను దర్శకుడు ఓదెల శ్రీకాంత్ గ్రాండ్ గా ప్లాన్ చేశారట. కథలో కీలక సందర్భంలో వచ్చే ఈ పాటకు భారీ సెట్స్, ప్రత్యేక కొరియోగ్రఫీ, ఆకట్టుకునే విజువల్స్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారని చిత్ర వర్గాల నుంచి సమాచారం.  థియేటర్లలో ఈ సాంగ్ పెద్ద హైలైట్‌గా నిలుస్తుందని సమాచారం. మరోవైపు ఈ సినిమా టీజర్ ను ఆగస్టు 6న  ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్భా చేస్తున్నారట. ‘దసరా’ తర్వాత నాని–కీర్తి సురేష్ జోడీ మరోసారి తెరపై కనిపించబోతుండటంతో అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ఈ స్పెషల్ సాంగ్ సినిమాకి ఎంత మేరకు సహాయపడుతుందో చూడాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

 

Updated Date - Aug 01 , 2026 | 11:18 AM