‘కరికాల’లో సాక్షి మడోల్కర్.. సందీప్ కిషన్‌తో మరో ఛాన్స్

ABN , Publish Date - Oct 13 , 2026 | 02:16 PM

సందీప్ కిషన్ హీరోగా యుగంధర్ ముని తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా సోషియో-ఫాంటసీ చిత్రం ‘కరికాల’లో సాక్షి మడోల్కర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా రెండు భాగాలు 2027 జూలై 2, అక్టోబర్ 28న విడుదల కానున్నాయి.

Sakshi Madolkar

'బబుల్ గమ్‌' చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సాక్షి మడోల్కర్... ఆ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోకపోయినా... అవకాశాలను మాత్రం పొందుతోంది. ప్రస్తుతం శ్రీవిష్ణు 'ఫ్యామిలీ ప్యాక్‌'లో నటిస్తున్న సాక్షి మడోల్కర్ తాజాగా మరో ప్రాజెక్ట్ ను తన కిట్‌లో వేసుకుంది. సందీప్‌ కిషన్‌ హీరోగా 'శంబాల' ఫేమ్‌ యుగంధర్ ముని రూపొందిస్తున్న 'కరికాల' సినిమాలో ఈమె హీరోయిన్‌గా చేస్తోంది.

WhatsApp Image 2026-10-13 at 1.14.50 PM.jpeg

ఇప్పటికే ఈ సినిమాలో మరో హీరోయిన్‌గా కేథరిన్ థ్రెసా పేరును ప్రకటించారు. ఈ సినిమాను మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు నిర్మిస్తున్నారు. రెండు భాగాలుగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా మొదటి చాప్టర్‌ 2027 జూలై 2న , రెండో చాప్టర్ 2027 అక్టోబర్ 28న విడుదల కాబోతోన్నట్టుగా మేకర్స్ ప్రకటించారు.


వరల్డ్ క్లాస్ టెక్నాలజీ, అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్, అద్భుతమైన ప్రొడక్షన్ డిజైన్, అత్యద్భుతమైన కథనంతో 'కరికాల' పాన్ ఇండియన్ సినిమాగా రాబోతోందని మేకర్స్ తెలిపారు. భారతీయ ప్రేక్షకులకు ఒక ప్రత్యేకమైన సోషియో-ఫాంటసీ అనుభవాన్ని అందించాలని లక్ష్యంగా ‘కరికాల’ టీం పని చేస్తోందని అన్నారు. ఈ సినిమాకి శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు. ఈ నెల 15న ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు జరగబోతున్నాయి.

ఇవి కూడా చదవండి:

OTT This Week: ఈ వారం కొత్త‌గా ఓటీటీకి వ‌చ్చిన, రాబోతున్న‌ సినిమాల జాబితా

సీఎం విజయ్ ని కలిసిన రౌడీ విజయ్..

బన్నీ-లోకేష్ సినిమా ఆగిపోయిందా? అసలు నిజం ఇదే

Updated Date - Oct 13 , 2026 | 02:23 PM