బుచ్చిబాబుకు స్టార్ హీరో ఖరీదైన గిఫ్ట్
ABN , Publish Date - Feb 18 , 2026 | 09:38 AM
రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో పెద్ది సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.
రామ్ చరణ్ (Ram Charan), జాన్వీ కపూర్ (Janhvi Kapoor) జంటగా బుచ్చిబాబు సానా (Buchi Babu Sana) దర్శకత్వంలో పెద్ది (Peddi) సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్ (Shiva Rajkumar), జగపతి బాబు (Jagapathi Babu), బాలీవుడ్ నటుడు దివ్యేందు (Divyenndu) కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆస్కార్ విన్నర్ ఎ.ఆర్? రెహమాన్ (A. R. Rahman) సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం ఏప్రిల్ 30న ప్రేక్షకుల ఎదుటకు రానుంది.
కాగా ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదల చేసిన గ్లింప్స్, చికిరి పాట ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ దక్కించుకోవడమే గాక సినిమాపై ప్రేక్షకుల్లో క్యురియాసిటీని అమితంగా పెంచేశాయి. త్వరలో ఈ చిత్రం నుంచి మరో పాటను కూడా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ నెల 15న దర్శకుడు బుచ్చిబాబు పుట్టిన రోజు జరిగింది. ఈ సందర్భంగా అనేకమంది సినీ సెలబ్రిటీలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ క్రమంలో కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్ బుచ్చిబాబుకు ఖరీదైన జీసీ వాచ్‌ను బహుకరించారు. ఇందుకు సంబంధించిన ఫొటోను బుచ్చిబాబు తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా పంచుకుంటూ థ్యాంక్యూ సో మచ్ ఫర్ ది లవ్‌లీ గిప్ట్ అంటూ శివ రాజ్ కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపాడు. కాగా ఈ గడియారం ఖరీదు ఆన్‌లైన్‌లో సుమారు లక్ష రూపాయల వరకు ఉంది. ప్రస్తుతం ఈ పోస్టు సామాజిక మాద్యమాల్లో వైరల్ అవుతోంది.
ఈ పోస్టు చూసిన ఫ్యాన్స్ అంతా 'అదిరిందయ్యా బుచ్చిబాబు.. సినిమా విడుదలకు ముందే మంచి గిఫ్ట్ పట్టావ్.. ఇక సినిమా రిలీజ్ అయ్యాక చిరంజీవి గారు అనీల్ రావిపూడికి కారు బహుమతిగా ఇచ్చినట్టుగానే రామ్ చరణ్ నుంచి లగ్జరీ కారు గిఫ్ట్ గ్యారంటీగా పడతావ్' అంటూ చమత్కరిస్తు పోస్టులు పెడుతున్నారు.