క‌మ్సామ్నీద.. ఎట్టా పుట్టావే భూమి మీద పాటొచ్చేసింది

ABN , Publish Date - Apr 12 , 2026 | 07:11 AM

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ హీరోగా మేర్ల‌పాక గాంధీ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న హ‌ర్ర‌ర్‌, కామెడీ చిత్రం కొరియ‌న్ క‌న‌క‌రాజు.

Korean Kanakaraju

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ (Varun Tej) హీరోగా మేర్ల‌పాక గాంధీ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న హ‌ర్ర‌ర్‌, కామెడీ చిత్రం కొరియ‌న్ క‌న‌క‌రాజు (Korean Kanakaraju). మిరాయ్ భామ రితికా నాయ‌క్ (Ritika Naya) క‌థానాయిక. యూవీ క్రియేషన్స్ (UV Creations) నిర్మించ‌గా త‌మ‌న్ (Thaman S) సంగీతం అందించాడు. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఈ వేస‌విలో ప్రేక్ష‌కుల ఎదుట‌కు రానుంది. ఇటీవ‌లే సినిమా నుంచి చిన్న గ్లింప్స్ విడుదల చేయ‌గా అనుహ్య స్పంద‌న‌ను రాబ‌ట్టుకుంది.

ఈ నేప‌థ్యంలో తాజాగా క‌మ్సామ్నీద (Kamsahamnida) అంటూ సాగే ఓ మెలోడీ సాంగ్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. కాస‌ర్ల శ్యాం (Kasarla Shyam) ఈ పాట‌కు సాహిత్యం అందించ‌గా చాలాకాలం త‌ర్వాత‌ సిద్ శ్రీరామ్ (Sid Sriram) గాత్రం అందించాడు. ప్ర‌స్తుతం ఈ పాట యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది. పాట‌లోని విజువ‌ల్స్ చాలా నేచుర‌ల్‌గా ఉండ‌ట‌మే గాక సాహిత్యం సైతం ఆక‌ట్టుకునేలా ఉంది. ట్యూన్ సైతం క్యాచీగా ఉంది. ఇంకెందుకు ఆల‌స్యంఈ పాట‌పై మీరూ ఓ లుక్ వేయండి.

Updated Date - Apr 12 , 2026 | 07:12 AM