Kalyan Ram: గెట్ వెల్ సూన్ బాబాయ్.. బాలకృష్ణపై ఎమోషనల్ పోస్ట్
ABN , Publish Date - Jul 21 , 2026 | 03:20 PM
నందమూరి నటసింహం, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సినిమా షూటింగ్‌లో స్వల్పంగా గాయపడిన ఘటన అభిమానులను ఆందోళనకు గురి చేసింది.
నందమూరి నటసింహం, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ (Balakrishna) సినిమా షూటింగ్‌లో స్వల్పంగా గాయపడిన ఘటన అభిమానులను ఆందోళనకు గురి చేసింది. ప్రస్తుతం ఆయన హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎన్.బి.కె.111 (వర్కింగ్ టైటిల్) చిత్రం షూటింగ్ కాకినాడ పోర్ట్‌లో జరుగుతోంది. ఈ క్రమంలో యాక్షన్ సన్నివేశం చిత్రీకరిస్తుండగా అనుకోని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న నటుడు నందమూరి కళ్యాణ్ రామ్ 'గెట్ వెల్ సూన్ బాబాయ్'.. అంటూ పోస్ట్ చేశారు. 'మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. మీరు ఎంతో ఇష్టపడే పనిలో అదే ఉత్సాహంతో కనిపిస్తారని నాకు పూర్తి నమ్మకం ఉంది' అని పేర్కొన్నారు. దాంతో ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సినిమా చిత్రీకరణలో బాలకృష్ణ, మంచు మనోజ్ మధ్య కీలక ఫైట్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తుండగా ప్రమాదవశాత్తు బాలయ్య మోకాలికి స్వల్ప గాయమైంది. వెంటనే అప్రమత్తమైన చిత్రబృందం షూటింగ్‌ను నిలిపివేసి ఆయనకు ప్రాథమిక చికిత్స అందించింది. అనంతరం పరీక్షల కోసం కాకినాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు స్కానింగ్ చేసిన అనంతరం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కొద్ది రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది. దీంతో అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.