Kalki 2: ప్రభాస్.. అభిమానులకు బిగ్ అప్‌డేట్! అంచనాలు రెట్టింపు
ABN , Publish Date - Apr 22 , 2026 | 12:33 PM
తాజాగా కల్కి-2 షూటింగ్ కు సంబంధించిన ఓ క్రేజీ వార్త నెట్టింట వైరల్ అవుతోంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా, డైరెక్టర్ నాగ్ అశ్విన్ (Nag Ashwin) తెరకెక్కించిన విజువల్ వండర్ ‘కల్కి 2898 AD’ (Kalki 2). బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సృష్టించిన ప్రభంజనం సామాన్యమైంది కాదు. వెయ్యి కోట్లకు పైగా వసూళ్లతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఈ చిత్రం, క్లైమాక్స్‌లో భైరవ పాత్రలోని కర్ణుడి అసలు స్వరూపాన్ని చూపించి ప్రేక్షకులను ఊపిరి బిగబట్టేలా చేసింది. అప్పటి నుంచే ఈ చిత్ర సీక్వెల్‌పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. వైజయంతీ మూవీస్ అధినేత అశ్వినీదత్ ఎక్కడా వెనకాడకుండా, అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ రెండో భాగాన్ని వేగంగా సిద్ధం చేస్తున్నారు.
తాజాగా కల్కి-2 షూటింగ్ కు సంబంధించిన ఓ క్రేజీ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. హైదరాబాద్‌లో ఈ మూవీ సీక్వెల్ కోసం ఒక భారీ సెట్‌ను నిర్మిస్తున్నారట. ఈ సెట్ సినిమాలోనే అత్యంత కీలకమైన ఇంటర్వెల్ బ్లాక్ షూటింగ్ కోసం సిద్ధమవుతోందని తెలుస్తోంది. మొదటి భాగం ముగింపులో వచ్చిన ట్విస్ట్‌లకు కొనసాగింపుగా, ఈ ఇంటర్వెల్ సీన్ థియేటర్లలో పూనకాలు తెప్పించేలా ప్లాన్ చేస్తున్నారట. దీని కోసం చిత్ర యూనిట్ రాత్రింబవళ్లు కష్టపడుతూ, హాలీవుడ్ స్థాయి మేకింగ్‌ను తలపించేలా ప్లాన్ చేస్తోంది. ఈ అప్‌డేట్ విన్న ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు.
ఈ ఇంటర్వెల్ సీక్వెన్స్‌లో కేవలం ప్రభాస్ మాత్రమే కాకుండా, బిగ్ బి అమితాబ్ బచ్చన్ (అశ్వత్థామ) (Amitabh Bachchan), లోక నాయకుడు కమల్ హాసన్ (సుప్రీమ్ యాస్కిన్) (Kamal Haasan) కూడా భాగం కాబోతున్నారు. ముగ్గురు దిగ్గజ నటులు ఒకే ఫ్రేమ్‌లో కనిపించే ఈ సన్నివేశం సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని ఇండస్ట్రీ టాక్. యాస్కిన్ వర్సెస్ కర్ణ-అశ్వత్థామల మధ్య జరిగే పోరు వెండితెరపై ఒక దృశ్య కావ్యంలా ఉండబోతోంది. ఈ సీన్ చూస్తున్నప్పుడు ప్రేక్షకులకు గూస్ బంప్స్ రావడం ఖాయమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇక సినిమా టైటిల్ విషయంలో కూడా ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. సీక్వెల్‌కు ‘కర్ణ 3102 BC’ (Karna 3102 BC) అనే పేరును మేకర్స్ పరిశీలిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మొదటి భాగంలో కల్కి ఆగమనాన్ని సూచిస్తే, రెండో భాగంలో పూర్తిగా కర్ణుడి పునరాగమనం, అతని గతాన్ని ప్రధానంగా చూపించబోతున్నారట. కర్ణుడి పాత్రలోని లోతును, ఆ పాత్రకున్న బలాన్ని ఈ టైటిల్ ప్రతిబింబించేలా ఉంటుందని భావిస్తున్నారు. ఈ వార్త ఫిలిం సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. మొదటి భాగంతో పోలిస్తే సీక్వెల్‌లో మైథాలజీ అంశాలు మెండుగా ఉంటాయని తెలుస్తోంది. కథ మొత్తం కర్ణుడి పాత్ర చుట్టూనే తిరుగుతూ, యుద్ధ క్షేత్రంలో అతని పరాక్రమాన్ని హైలైట్ చేయనున్నారు. ఆధునిక కాలానికి, పురాణ కాలానికి మధ్య నాగ్ అశ్విన్ అల్లిన ఈ కథా గమనం ప్రేక్షకులకు ఒక సరికొత్త అనుభూతిని ఇస్తుందనడంలో సందేహం లేదు.