K Bhagyaraj: దర్శకుడు భాగ్యరాజ్‌ చివరి వీడియో ఇదే..

ABN , Publish Date - Jun 27 , 2026 | 02:58 PM

ప్రముఖ దర్శకుడు, నటుడు కె.భాగ్యరాజ్‌ మృతి పట్ల చిరంజీవి, వెంకటేశ్‌, రాధిక, సుహాసిని వంటి స్టార్లు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

K Bhagya Raj Last Video

ప్రముఖ దర్శకుడు, నటుడు కె.భాగ్యరాజ్‌ మృతి పట్ల చిరంజీవి, వెంకటేశ్‌, రాధిక, సుహాసిని వంటి స్టార్లు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆయన చివరి వీడియో నెట్టింట వైరల్‌ అవుతుంది. గురువారం ఆయన నటి కుష్బూ కూతురు పెళ్లికి హాజరయ్యారు. అక్కడి చిరంజీవి, వెంకటేశ్‌, నాగార్జునలతో సరదాగా సంభాషించారు. వారితో కలిసి వేదికపైకి వెళ్లి వధూవరులను ఆశీర్వదించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. అలాగే పలువురు సినీతారలు కూడా భాగ్యరాజ్‌కు నివాళులు అర్పిస్తూ వీడియోలు పోస్ట్‌ చేశారు.

‘నేను 50 ఏళ్ల క్రితం పరిచయం చేసిన కె.భాగ్యరాజ్‌ ఈరోజు లేదనే వార్త తీవ్ర వేదనకు గురిచేసింది. తమిళ చిత్ర పరిశ్రమ ఒకే నెలలో ఇద్దరు రాజుల్ని కోల్పోయింది’ అని విశ్వనాయకుడు కమల్‌హాసన్‌ ట్వీట్‌లో పేర్కొన్నారు.

‘భాగ్యరాజ్‌ నాకు మంచి ేస్నహితుడు. తెలుగు సినిమా ఇండస్ట్రీకి రావడానికి ముందు తమిళంలో చేసిన చివరి చిత్రం ‘డార్లింగ్‌ డార్లింగ్‌ డార్లింగ్‌’ ఆయన దర్శకత్వంలోనే! కష్టపడి ఎదిగిన దర్శకుడాయన. ఇప్పుడు ఆయన మన మధ్య లేరనే విషయాన్ని నమ్మలేకపోతున్నా’ అని సుమన్ పేర్కొన్నారు.

‘దర్శకుడు భాగ్యరాజ్‌ ఇకలేరని విషయం నమ్మలేకపోతున్నా. గొప్ప దర్శకుడు, అసాధారణ నటుడు. సామాజిక సందేశాలున్న ఎన్నో సినిమాలు ఆయన దర్శకత్వంలో వచ్చాయి. తమిళ చిత్రసీమ గొప్ప మేధావుల్లో ఒకరిని కోల్పోయింది’

- సిమ్రాన్‌

Updated Date - Jun 27 , 2026 | 04:18 PM