'జైలర్ -2' వెనుకే 'కిల్లర్' ఆగమనం!

ABN , Publish Date - Aug 20 , 2026 | 05:22 PM

జ్యోతి పూర్వజ్‌ ప్రధాన పాత్ర పోషిస్తున్న సై ఫై థ్రిల్లర్ 'కిల్లర్' సినిమా విజయదశమి కానుకగా అక్టోబర్ 17న విడుదల అవుతోంది.

Killer Movie

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్, లీడ్ రోల్స్ లో నటిస్తున్న సెన్సేషనల్ సై ఫై థ్రిల్లర్ మూవీ 'కిల్లర్'. ఇందులో మనీష్ గిలాడా, చంద్రకాంత్ కొల్లు, విశాల్ రాజ్, అర్చన అనంత్, గౌతమ్ చక్రధర్ కొప్పిశెట్టి ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను థింక్ సినిమా, ఏయూ అండ్ ఐ స్టూడియోస్ బ్యానర్స్ పై పూర్వాజ్ , పద్మనాభ రెడ్డి ఎ. నిర్మిస్తున్నారు. ఉర్వీశ్ పూర్వజ్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. పూర్వాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను విజయదశమి పర్వదినం సందర్భంగా అక్టోబర్ 17న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నట్లు తాజాగా మేకర్స్ ప్రకటించారు.


'కిల్లర్' సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ సందర్భంగా రిలీజ్ చేసిన వీడియో గ్లింప్స్ ఆద్యంతం ఆసక్తి కలిగిస్తోంది. ఈ సినిమా విడుదలయ్యే అక్టోబర్ 17న మన దేశపు గొప్ప సైంటిస్ట్ డా.పూర్వజ్ ను ఏలియన్స్ కాంటాక్ట్ అవుతారు. ఒక స్పేస్ షిప్ ను భూమికి పంపిస్తున్నట్లు తెలియజేస్తారు. ఈ విషయాన్ని మిగతా వారికీ చెప్పమని, తాము మానవులను రక్షించాలని అనుకుంటున్నట్లు ఆ ఏలియన్ డా.పూర్వజ్ కు చెబుతుంది. మన భవిష్యత్, ఆ ఏలియన్ కు గతం. ఇలా మరో కాలం నుంచి వస్తున్న ఆ ఏలియన్ డా.పూర్వజ్ ను ఎందుకు కాంటాక్ట్ అయ్యింది ? స్పేస్ షిప్ ను భూమికి ఎందుకు పంపించాలనుకుంది ? మానవాళికి ఏర్పడిన ముప్పు ఏంటి ? ఆ ఏలియన్ చేయాలనుకున్న సాయం ఏంటి ? వంటి ప్రశ్నలతో రిలీజ్ డేట్ గ్లింప్స్ క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది. 'కిల్లర్' మూవీని ఓఎంజి పిక్చర్స్ సంస్థ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. దీనిని అమెరికా, యూరప్, కెనడా, అరబ్ దేశాలు, మలేషియా, న్యూజిలాండ్, రష్యా వంటి దేశాల్లో విడుదల చేయబోతోంది.

ఇదిలా ఉంటే ఈ యేడాది విజయ దశమి కానుకగా రజనీకాంత్‌ 'జైలర్ -2' చిత్రం అక్టోబర్ 15న విడుదల అవుతోంది. అలానే ధనుష్‌ 'ఓం' అక్టోబర్ 16న విడుదల కావాల్సి ఉంది. అలానే అశోక్‌ గల్లా హీరోగా నటిస్తున్న 'వింటారా సరదాగా' సినిమా అక్టోబర్ 17న రిలీజ్ అవుతోంది. ఇప్పుడు తాజాగా 'కిల్లర్' సైతం విజయదశమి రేస్ లోకి వచ్చింది.

ఇవి కూడా చదవండి:

సొంతూరులో కూరగాయలు అమ్మిన హీరో.. ఏఐ ఫొటోలు కాదండోయ్!

మరోసారి అసూయ చాటుకున్న సిద్ధార్థ్‌ ఆనంద్!

Nagarjuna: ఆ సినిమా చేయడమే నేను తీసుకున్న సాహసోపేత నిర్ణయం

Updated Date - Aug 20 , 2026 | 05:24 PM