NTR: పవన్ కల్యాణ్‌కు సర్జరీ.. ఎన్టీఆర్ భావోద్వేగ పోస్ట్..
ABN , Publish Date - Apr 19 , 2026 | 01:49 PM
ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌కు సర్జరీ జరిగిన సంగతి తెలిసిందే! పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పవన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌కు (Pawan Kalyan) సర్జరీ జరిగిన సంగతి తెలిసిందే! పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పవన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. ఈ మేరకు ఆదివారం జూనియర్ ఎన్టీఆర్ (Ntr), పవన్ ఆరోగ్యాన్ని ఉద్దేశించి ట్వీట్ చేశారు. ‘ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. మీరు రెట్టింపు ఉత్సాహంతో, పూర్తి ఆరోగ్యంతో త్వరలోనే మళ్ళీ ప్రజా సేవలోకి రావాలని ఆశిస్తున్నాను’ అని తారక్ ట్వీట్‌లో పేర్కొన్నారు. పవన్‌కల్యాణ్‌కు, తారక్‌కు మంచి అనుబంధం ఉంది. పలు వేదికలపై వీరిద్దరూ సందడి చేశారు. తారక్ మంచి నటుడు, డాన్సర్ అని పలు వేదికలపై పవన్ చెబుతుంటారు.
ఇటీవల పవన్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. తారక్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘డ్రాగన్’ చిత్రం చేస్తున్నారు. తదుపరి కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర-2’ సినిమాపై దృష్టి పెట్టనున్నారు.