NTR: త్వరగా కోలుకోండి బాల బాబాయ్..

ABN , Publish Date - Jul 21 , 2026 | 03:35 PM

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) హీరోగా గోపీచంద్ మలినేని (Gopichand Malineni) తెరకెక్కిస్తోన్న సినిమా షూటింగ్ లో బాలయ్య ప్రమాదానికి గురయ్యారు.

NTR

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) హీరోగా గోపీచంద్ మలినేని (Gopichand Malineni) తెరకెక్కిస్తోన్న సినిమా షూటింగ్ లో బాలయ్య ప్రమాదానికి గురయ్యారు. కాకినాడ పోర్ట్ ప్రాంగణంలో బాలయ్య 111వ చిత్రం కోసం యాక్షన్ సీన్స్ తెరకెక్కిస్తున్నారు. బాలకృష్ణ, ఇందులో నెగటివ్ రోల్ పోషిస్తోన్న మంచు మనోజ్ మధ్య పోరాట సన్నివేశాలను చిత్రీకరిస్తూండగా బాలయ్య కాలుజారి కిందపడ్డారు. దాంతో ఆయన మోకాలికి స్వల్ప గాయమైంది. వెంటనే కాకినాడలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. గాయానికి చికిత్స చేసిన డాక్టర్లు కంగారు పడవలసిన పనిలేదని చెప్పారు. గాయం చిన్నదే కాబట్టి కొద్ది రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని వైద్యులు తెలిపారు. ఈ వార్త తెలియగానే కంగారు పడ్డ అభిమానులు, వైద్యుల చెప్పింది తెలిసి ఊపిరి పీల్చుకున్నారు. వార్త తెలిసిన నందమూరి కళ్యాణ్ రామ్ గెట్ వెల్ సూన్ బాల బాబాయ్.. అంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు.


ఇక బాలయ్య ఆరోగ్యంపై మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ కూడా స్పందించాడు. బాలకృష్ణ త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ ఎన్టీఆర్ తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఒక భావోద్వేగపూరితమైన పోస్ట్‌ను షేర్ చేశాడు. 'త్వరగా కోలుకోండి బాల బాబాయ్. మీరు త్వరగా కోలుకుని, మళ్లీ పూర్వపు ఆరోగ్యంతో కనిపించాలని ఆకాంక్షిస్తున్నాను. మీరు మళ్లీ ఫుల్ ఫామ్‌తో బాక్సాఫీస్ దగ్గర గర్జించడం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను' అంటూ ఎన్టీఆర్ తన ఆకాంక్షను వ్యక్తం చేశాడు. బాబాయ్ పట్ల ఎన్టీఆర్ చూపించిన ఈ ప్రేమాభిమానాలు అటు నందమూరి అభిమానులను, ఇటు సాధారణ ప్రేక్షకులను ఎంతో సంతోషానికి గురిచేస్తున్నాయి.


నందమూరి కుటుంబంలో అప్పుడప్పుడు రకరకాల ప్రచారాలు జరుగుతున్నప్పటికీ, బాబాయ్ ఆరోగ్యం గురించి ఎన్టీఆర్ వెంటనే స్పందించి ఇలా ట్వీట్ చేయడం విశేషం. దీంతో ఎప్పటికైనా నందమూరి కుటుంబం ఒకటే అని కామెంట్స్ చేస్తున్నారు. బాలకృష్ణ త్వరగా కోలుకుని మళ్లీ సెట్స్‌లోకి అడుగుపెట్టి, తన మార్క్ మాస్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో అలరించాలని అభిమానులు కూడా కామెంట్స్ రూపంలో ఆకాంక్షిస్తున్నారు.

Updated Date - Jul 21 , 2026 | 04:59 PM