బెంగళూరులో.. ఎన్టీఆర్! ఫ్యాన్స్ రచ్చ రచ్చ.. సీఎం సీఎం అంటు నినాదాలు! తప్పిన భారీ ప్రమాదం
ABN , Publish Date - Mar 08 , 2026 | 12:57 PM
యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR) అంటే రెండు తెలుగు రాష్ట్రాలలో ఉండే క్రేజే వేరు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR) అంటే రెండు తెలుగు రాష్ట్రాలలో ఉండే క్రేజే వేరు. సినిమా జయపజయాలతో లేకుండా అంతకంతకు ఆయన ఇమేజ్ రెట్టింపు అవుతూనే ఉంది. ఆర్ ఆర్ ఆర్ తర్వాత రాష్ట్రాల పరిధులను దాటి విశ్వవాప్తం అయింది. తాజాగా బెంగళూరు (Bengaluru)లో కిమ్స్ (KIMS) హస్పిటల్ ప్రారంభోత్సవానికి ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హజరయ్యాడు.
ఎన్టీఆర్ వస్తున్నాడనే విషయం ఓ రోజు ముందే బయటకు తెలియడంతో బెంగళూరులో ఆదివారం ఉదయం నుంచే అభిమానుల తాకిడి పెరిగింది. హస్పటల్‌కు వెళ్లే అన్ని మార్గాలు కీలోమీటర్ల మేర అభిమానులతో నిండిపోయాయి. అంతేగాక సీఎం సీఎం, బాబులకే బాబు అనే నినాదాలతో హోరెత్తించారు.
తీరా ఎన్టీఆర్ వచ్చి హస్పటల్ లోకి వెళ్లే క్రమంలో ఫ్యాన్స్ ఎక్కువగా లోపలికి వచ్చేయడంతో ఎన్టీఆర్ ముందుకు కదలడం కూడా ఇబ్బందైంది. ఓ దశలో ఎస్కలేటర్ అద్దం సైతం పగిలిపోయింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మరోవైపు బెంగళూరులో ఎన్టీఆర్‌ను చూసేందుకు ఇంత భారీ సంఖ్యలో అభిమానులు రావడం నిర్వాహాకులను, నెటిజన్లను ఆశ్చర్య పరిచింది. తిరిగి వెళ్లిపోయే సమయంలో తనను చూడటానికి వచ్చిన ఫ్యాన్స్ కోసం ఎన్టీఆర్ కారు టాప్ పై నుంచి అభివాదం చేస్తూ వెళ్లారు.
ఇదిలాఉంటే.. గత కొద్ది రోజులుగా ప్రశాంత్ దర్శకత్వంలో నటిస్తున్న డ్రాగన్ సినిమా షూట్‌లో బిజీగా ఉన్న ఎన్టీఆర్ మీడియా ఎదుట అంతగా కనిపించలేదు. అంతేగాక ఇటీవల సినిమా కోసం ప్రత్యేక లుక్ మోయింటెన్ చేస్తున్నట్లు సమాచారం బయటకు రావడంతో ఫ్యాన్స్ ఎన్టీఆర్ కొత్త లుక్ కోసం ఎంతో అత్రుతగా ఎదురు చూస్తున్నారు.
ఈ సమయంలో ఎన్టీఆర్ ఇలా బయటకు రావడంతో అభిమానులు ఒక్కసారిగా భారీ సంఖ్యలో జమ అయ్యారు. ఆపై ఎన్టీఆర్ న్యూ లుక్‌ను చూసి సంబుర పడుతున్నారు. ఆరు నెలల క్రితం బక్కగా ఉండి చూడలేకుండా ఉన్న ఎన్టీఆర్ లుక్‌కు భిన్నంగా ఇప్పడు ఉండడంతో అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.