ఎన్టీఆర్ - అనిల్ రావిపూడి.. మెంటల్ ఎక్కించే కాంబో.. అస్సలు ఊహించలేదే
ABN , Publish Date - Nov 14 , 2026 | 05:18 PM
టాలీవుడ్లో మోస్ట్ అవేటెడ్ కాంబినేషన్స్ లో ఒకటి మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (NTR)- అనిల్ రావిపూడి (Anil Ravipudi). గత కొంతకాలంగా తారక్ యాక్షన్ సినిమాలతోనే ప్రేక్షకుల ముందకు వస్తున్నాడు. దేవర, వార్ 2.. ఇప్పుడు రాబోతున్న డ్రాగన్ కూడా ఫుల్ యాక్షన్ సినిమానే.
టాలీవుడ్లో మోస్ట్ అవేటెడ్ కాంబినేషన్స్ లో ఒకటి మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (NTR)- అనిల్ రావిపూడి (Anil Ravipudi). గత కొంతకాలంగా తారక్ యాక్షన్ సినిమాలతోనే ప్రేక్షకుల ముందకు వస్తున్నాడు. దేవర, వార్ 2.. ఇప్పుడు రాబోతున్న డ్రాగన్ కూడా ఫుల్ యాక్షన్ సినిమానే. ఇక దీని తరువాత గాడ్ ఆఫ్ వార్ మొత్తం డివైన్ మోడ్ లో ఉంటుంది. దీంతో నందమూరి ఫ్యాన్స్ అందరూ తారక్ నుంచి ఒక ఛేంజ్ కోరుకుంటున్న విషయం తెల్సిందే. తాజాగా అభిమానుల కోరిక ఫలించింది. కామెడీ పండించడంలో ఎన్టీఆర్ టైమింగ్ ని ఎవరూ కొట్టలేరు. రీల్ అయినా.. రియల్ అయినా ఎన్టీఆర్ కామెడీ టైమింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. అలాంటి తారక్ కి.. అనిల్ రావిపూడి లాంటి డైరెక్టర్ దొరికేతే, ఆ ఊహే ఎంతో అద్భుతంగా ఉంది కదా. ఇప్పుడు ఆ ఊహే త్వరలోనే నిజం కాబోతుంది. అవును.. టాలీవుడ్లో మోస్ట్ అవేటెడ్ కాంబినేషన్ ని తారక్ అధికారికంగా ప్రకటించాడు.
ఎన్టీఆర్ (Jr NTR) హీరోగా, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక భారీ సినిమా అధికారికంగా లాక్ అయింది. నందమూరి కల్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై ఈ ప్రతిష్టాత్మక చిత్రం అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కనుంది. అందుతున్న సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్ట్ లో దిల్ రాజు కూడా ఒక నిర్మాతగా వ్యవహరిస్తున్నారని టాక్. ఇప్పటికే దిల్ రాజు- ఎన్టీఆర్ కాంబోలో బృందావనం, రామయ్య వస్తావయ్యా సినిమాలు వచ్చాయి. చాలా గ్యాప్ తరువాత దిల్ రాజు బ్యానర్ లో ఎన్టీఆర్ నటిస్తుండడం విశేషం. ఎన్టీఆర్ మాస్ ఇమేజ్, అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్టైన్మెంట్ అండ్ కమర్షియల్ ఎలిమెంట్స్ కలగలిపి ఈ సినిమాను రూపొందించనున్నారు. అనిల్ రావిపూడి తనదైన శైలిలో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూనే, మరోవైపు ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గూస్బంప్స్ తెప్పించే యాక్షన్ సీక్వెన్స్‌లను ఈ చిత్రంలో డిజైన్ చేస్తున్నట్లు సమాచారం. టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించేందుకు ఈ క్రేజీ ప్రాజెక్ట్ సిద్ధమవుతోంది.
ఈ సినిమాకు సంబంధించి మరో క్రేజీ అప్డేట్ ఏమిటంటే.. ఈ చిత్రాన్ని బాక్సాఫీస్ టార్గెట్‌గా సంక్రాంతి 2028 కానుకగా విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతి బరిలో ఎన్టీఆర్, అనిల్ రావిపూడి కాంబో సినిమా వస్తోందంటే అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం ఈ అనౌన్స్మెంట్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. ప్రస్తుతం తారక్ డ్రాగన్ సినిమాతో బిజీగా ఉన్నాడు. దీని తరువాత త్రివిక్రమ్ తో గాడ్ ఆఫ్ వార్ లైన్ లో ఉంది. మరి దీని తరువాత అనిల్ రావిపూడి సినిమాని పట్టాలెక్కిస్తాడా.. ? లేకపోతే త్రివిక్రమ్ ని పక్కన పెట్టి మొదట అనిల్ సినిమానే ఫినిష్ చేస్తాడా అనేది తెలియాల్సి ఉంది.
ఏదిఏమైనా ఈ ఊహించని కాంబో ఇలా సడెన్ గా ప్రకటించడంతో ఫ్యాన్స్ ఉబ్బితబ్బిబ్బైపోతున్నారు. ఇంకోపక్క అనిల్.. ఈ సంక్రాంతికి అన్న కళ్యాణ్ రామ్ ని దింపుతున్నాడు. వెంకటేష్, కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన జనవరి 12 విడుదల ఈ సంక్రాంతికి రానుంది. ఆ పై వచ్చే సంక్రాంతికి తమ్ముడు దిగుతున్నాడు. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ తో ఈ అన్నదమ్ముళ్లు ఎలాంటి విజయాలను అందుకుంటారో చూడాలి.