తారక్.. బర్త్ డే బ్లాస్ట్! 180 సెకన్ల.. విజువల్ విధ్వంసం..
ABN , Publish Date - May 10 , 2026 | 03:39 PM
మే 20వ తేదీన ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయనున్న సినిమా గ్లింప్స్ కు సంబంధించిన ఒక వార్త సెన్సేషన్‌గా మారింది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Ntr), సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి విదితమే. ఈ మూవీ అనౌన్స్ అయినప్పటి నుంచే సినీ వర్గాల్లో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. 'దేవర' వంటి సూపర్ హిట్ తర్వాత తారక్ సోలోగా చేస్తున్న సినిమా కావడం, 'కేజీఎఫ్', 'సలార్' వంటి చిత్రాలతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ప్రశాంత్ నీల్.. ఎన్టీఆర్ వంటి మాస్ పల్స్ తెలిసిన హీరోని ఎలా చూపిస్తారో అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఈ ప్రాజెక్ట్ కేవలం టాలీవుడ్ స్థాయిలోనే కాకుండా, పాన్ ఇండియా రేంజ్‌లో భారీ ఇంపాక్ట్ చూపించేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, సినిమాకు సంబంధించిన ప్రతి చిన్న అప్‌డేట్ కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
తాజాగా.. ఈ సినిమాకు సంబంధించిన ఒక వార్త సెన్సేషన్‌గా మారింది. అదేమిటంటే.. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా మే 20వ తేదీన విడుదల చేయనున్న గ్లింప్స్‌ను సుమారు 180 సెకన్ల (3 నిమిషాల) నిడివితో సిద్ధం చేస్తున్నారట. సాధారణంగా టీజర్లు నిమిషం లేదా అంతకంటే తక్కువ నిడివిలోనే ఉంటాయి, కానీ ప్రశాంత్ నీల్ తన మార్క్ యాక్షన్‌ను, ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్‌ను ఎలివేట్ చేయడం కోసం ఈ గ్లింప్స్ నిడివిని కాస్త ఎక్కువగా ఉండాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ మూడు నిమిషాల నిడివి ఉన్న వీడియో ప్రేక్షకులకు మునుపెన్నడూ చూడని విజువల్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించబోతోందని సినీ వర్గాలు అంటున్నాయి.
ప్రశాంత్ నీల్ సినిమాల్లో కనిపించే డార్క్ థీమ్, రా యాక్షన్ ఈ చిత్రంలో కూడా హైలైట్‌గా నిలవనున్నాయి. ఈ సినిమాకు 'డ్రాగన్' అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతుండగా, కథా నేపథ్యం చాలా విభిన్నంగా ఉండబోతోందని తెలుస్తోంది. ఎన్టీఆర్ కోసం ఒక ప్రత్యేకమైన ప్రపంచాన్ని ప్రశాంత్ నీల్ సృష్టించారని, అందులో ఎన్టీఆర్ పాత్ర అత్యంత శక్తివంతంగా ఉంటుందని సమాచారం. ముఖ్యంగా ఎమోషన్స్‌ను పీక్ లెవల్‌లో చూపిస్తూనే, గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో ఈ సినిమాను తెరకెక్కించేందుకు దర్శకుడు కసరత్తు చేస్తున్నారు.
ప్రశాంత్ నీల్ సినిమాల విజయంలో సంగీత దర్శకుడు రవి బస్రూర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ సినిమాకు కూడా ఆయనే సంగీతం అందిస్తుండటంతో అంచనాలు రెట్టింపు అయ్యాయి. 180 సెకన్ల పాటు సాగే ఈ గ్లింప్స్‌లో రవి బస్రూర్ ఇచ్చే మ్యూజిక్ థియేటర్లలో ప్రేక్షకులకు పూనకాలు తెప్పించేలా ఉంటుందని టాక్. ప్రతి ఫ్రేమ్‌ను ఎలివేట్ చేసేలా ఆ సౌండ్ ట్రాక్ ఉంటుందని, ముఖ్యంగా ఎన్టీఆర్ ఎంట్రీ సీన్ వద్ద వచ్చే మ్యూజిక్ ఒక రేంజ్‌లో ఉండబోతోందని తెలుస్తోంది. మేకింగ్ విషయంలో ఎక్కడా తగ్గకుండా మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాయి. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసే ఈ గ్లింప్స్ యూట్యూబ్‌లో రికార్డులను తిరగరాయడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.