Jojo: మనోభావాల బ్యాచ్ జరా దూరం.. మోటు సరసం ఇది

ABN, Publish Date - Oct 12 , 2026 | 05:55 PM

వినోదం, ప్రేమ, భావోద్వేగాలు, అనూహ్య మలుపుల కలయికతో తెరకెక్కుతున్న ‘జోజో’ సినిమా  ‘కాషన్‌ 1’ పేరుతో టీజర్ ను విడుదల చేశారు. 

వినోదం, ప్రేమ, భావోద్వేగాలు, అనూహ్య మలుపుల కలయికతో తెరకెక్కుతున్న చిత్రం ‘జోజో’(jojo). జొన్నగిరి వజ్రాల గనుల నేపథ్యంలో సాగే ఈ సినిమాలో  కృష్ణకమల్‌, మహి, మకరంద్‌ దేశ్‌పాండే, ఫణి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దేవా కట్టా సమర్పణలో, కిరణ్‌ జయ్‌ కుమార్‌ దర్శకత్వంలో విజయకృష్ణ లింగమనేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'మనోభావాల బ్యాచ్ ఇది మీకోసం మాత్రం కాదు' అంటూ  ప్రమోట్ చేస్తూ  ‘కాషన్‌ 1’ పేరుతో టీజర్ ను  విడుదల చేశారు. ఇందులో మాటలు ఆకట్టుకుంటున్నాయి. మరి జొన్నగిరి వజ్రాల గనుల నేపథ్యంలో సాగే ఈ కథ ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని అందించనుందో చూడాలి.

Updated at - Oct 12 , 2026 | 06:00 PM