శ్రీనివాస మంగాపురం వాయిదా..

ABN , Publish Date - Jun 28 , 2026 | 05:41 PM

ఘట్టమనేని వారసుడు, రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ (Jayakrishna) టాలీవుడ్ డెబ్యూ చిత్రం శ్రీనివాస మంగాపురం (Srinivasa Mangapuram). అజయ్ భూపతి (Ajay Bhupathi) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రాషా తడానీ హీరోయిన్ గా నటిస్తుండగా మోహన్ బాబు విలన్ గా కనిపిస్తున్నాడు.

Srinivasa Mangapuram

ఘట్టమనేని వారసుడు, రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ (Jayakrishna) టాలీవుడ్ డెబ్యూ చిత్రం శ్రీనివాస మంగాపురం (Srinivasa Mangapuram). అజయ్ భూపతి (Ajay Bhupathi) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రాషా తడానీ హీరోయిన్ గా నటిస్తుండగా మోహన్ బాబు విలన్ గా కనిపిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా ఇండస్ట్రీలో ఎంతో ఆసక్తిని రేకెత్తించాయి. ఇక శ్రీనివాస మంగాపురం జూలై 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోందంటూ మొన్నటి దాకా చిత్ర యూనిట్ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ వచ్చింది. అందుకు తగ్గట్లే ప్రచారాలను కూడా ప్రారంభించారు.


అయితే, గత కొన్ని రోజులు నుంచి హఠాత్తుగా ఈ సినిమా ప్రమోషన్లు పూర్తిగా ఆపేశారు. ట్రైలర్ రిలీజ్, ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మహేష్ బాబు వస్తున్నాడు అనే వార్తలు ఏవి సోషల్ మీడియాలో కనిపించడం లేదు. దీంతో అసలు శ్రీనివాస మంగాపురం రిలీజ్ అవుతుందా.. ? లేదా.. ? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా వాయిదా పడినట్లు తెలుస్తోంది. బాక్సాఫీస్ వద్ద ఉన్న విపరీతమైన పోటీని తట్టుకోలేక శ్రీనివాస మంగాపురం వెనక్కి తగ్గినట్లు టాక్ నడుస్తోంది.


జులై మొత్తం మంచి సినిమాలతో నిండిపోయింది. జూలై 3న కంటెంట్ పరంగా ఇప్పటికే మంచి హైప్ క్రియేట్ చేసుకున్న రావు బహదూర్, నాగబంధం వంటి చిత్రాలు థియేటర్లలోకి వస్తున్నాయి. జూలై 10న అఖిల్ లెనిన్ రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఇన్ని సినిమాల మధ్య జయకృష్ణ డెబ్యూ సినిమా రిలీజ్ కావడం కొంచెం కష్టంతో కూడుకున్న పని అనే చెప్పాలి. ఒక కొత్త హీరో సినిమాకు ఓపెనింగ్స్ రావాలన్నా, థియేటర్ల వద్ద బజ్ క్రియేట్ అవ్వాలన్నా పక్కా ప్రమోషన్స్ చాలా అవసరం. ఇప్పటివరకు శ్రీనివాస మంగాపురం ప్రమోషన్స్ మొదలుపెట్టింది లేదు. మహేష్ బాబు కొద్దిగా సపోర్ట్ గా నిలబడతే బజ్ పెరుగుతోంది అనుకుంటే.. మహేష్ ప్రస్తుతం వెకేషన్ లో ఉన్నాడు. ఈ కారణం చేత కూడా ఈ సినిమా వాయిదా పడిందని టాక్. ఇక శ్రీనివాస మంగాపురం జులై 30 న వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలోనే మేకర్స్ ఈ సినిమా రిలీజ్ డేట్ ని అధికారికంగా ప్రకటించనున్నారు. మరి ఈ సినిమాతో ఘట్టమనేని వారసుడు ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Updated Date - Jun 28 , 2026 | 06:08 PM