అక్టోబరులో.. ‘రామానుజ
ABN , Publish Date - Sep 05 , 2026 | 06:21 AM
సాయివెంకట్ నటిస్తూ దర్శకత్వం వహిస్తోన్న చిత్రం ‘జయహో రామానుజ’.
సాయివెంకట్ నటిస్తూ దర్శకత్వం వహిస్తోన్న చిత్రం ‘జయహో రామానుజ’ (Jayaho Ramanuja). ఈ చిత్రాన్ని సుదర్శనం ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సాయి ప్రసన్న, ప్రవళ్లిక నిర్మిస్తున్నారు. జో శర్మ కథానాయిక. సుమన్, ప్రవళ్లిక ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సినిమా అక్టోబరు 25న విడుదలవుతున్న సందర్భంగా నిర్వహించిన వేడుకలో ఈ చిత్రం నుంచి పాటను విడుదల చేశారు.
టీఎ్‌ఫపీసీ చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ ‘మనుషులంతా ఒక్కటేననే సందేశాన్ని చాటిన మహనీయుడు రామానుజాచార్యుల జీవిత కథను ఈ తరం వారికి చూపించే ప్రయత్నం చేయడం ప్రశంసనీయం’ అని అన్నారు. ఈ సినిమాను నిర్మించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా అని నిర్మాత, నటి ప్రవళ్లిక అన్నారు. సాయి వెంకట్, డైరెక్టర్ సముద్ర తదితరులు పాల్గొన్నారు.