ఎన్టీఆర్‌పై ఫోకస్‌ పెట్టిన జాన్వీ... 'దేవర 2' ఖాయమా!

ABN , Publish Date - Apr 14 , 2026 | 12:29 PM

ఎన్టీఆర్‌ మేకోవర్‌కు బాలీవుడ్‌ అందాల భామ జాన్వీకపూర్ ఫిదా అయిపోయింది. అన్ బిలీవబుల్‌ అంటూ యంగ్ టైగర్‌కు కితాబిచ్చింది జాన్వీ!

అతిలోక సుందరి శ్రీదేవి (Sreedevi) పెద్ద కూతురు జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor) యంగ్ టైగర్‌ ఎన్టీఆర్‌ (NTR) 'దేవర' (Devara) సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. ఆ సినిమా 500 కోట్లకు పైగా గ్రాస్‌ వసూలు చేసింది. అయితే... అంత భారీ విజయాన్ని సినిమా అందుకున్నా... దీని సీక్వెల్ ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందనే విషయంలో మేకర్స్ క్లారిటీ ఇవ్వడం లేదు. దాంతో అసలు 'దేవర 2' ఉంటుందో... ఉండదో అనే సందేహాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జాన్వీ కపూర్‌ పెట్టిన పోస్ట్‌తో ఈ అనుమానాలన్నీ పటాపంచలై పోయాయని అభిమానులు చెబుతున్నారు.


'దేవర' సినిమా విడుదలకు ముందే జాన్వీ కపూర్‌... రామ్ చరణ్‌ 'పెద్ది' మూవీకి సైన్ చేసింది. ఆ సినిమాలో గ్రామీణ యువతిగా జాన్వీ నటిస్తోంది. ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ సినిమా షూటింగ్‌ పూర్తి కాని కారణంగా వాయిదా పడింది. ఇదిలా ఉంటే... సోమవారం ఎన్టీఆర్‌ ప్రశాంత్‌ నీల్‌ మూవీ కోసం చేసిన వర్కౌట్స్‌కు సంబంధించిన స్టిల్‌ ఒకటి బయటకు వచ్చింది. కండలు తిరిగిన ఎన్టీఆర్‌ దేహాని చూసి జనాలు ఫిదా అయిపోయారు. ఎంత కష్టపడితే ఎన్టీఆర్‌ ఈ స్థాయిలో కండల్ని పెంచాడో కదా! అని మెచ్చుకున్నారు. అయితే ఇలా ఎన్టీఆర్‌ను అభినందించిన వారి జాబితాలోకి జాన్వీ కపూర్ కూడా చేరిపోయింది. ఎన్టీఆర్‌ స్టిల్‌కు 'అన్‌ బిలీవబుల్‌' అంటూ కాప్షన్ పెట్టి... కితాబిచ్చింది. సహజంగా హీరోయిన్లు... ఇలా ఊరికే ఎవరికీ కితాబివ్వరు. అయితే ఎన్టీఆర్‌తో ఆమె 'దేవర 2' నటించాల్సి ఉన్న కారణంగానూ, ఆ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళే ఛాన్స్ ఉన్నందువల్లే ఇలా మెచ్చుకుందని కొందరంటున్నారు. ఇందులో నిజానిజాల మాట ఎలా ఉన్నా.... ఎన్టీఆర్‌ మేకోవర్‌ జాన్వీకపూర్‌కు తెగ నచ్చేసిందన్నది మాత్రం నిజం.

Updated Date - Apr 14 , 2026 | 12:29 PM